Allu Arjun: పుష్ప 2 కోసం అస్సలు తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నెలలో పుష్ప- 2 మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
- Author : Gopichand
Date : 07-11-2022 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నెలలో పుష్ప- 2 మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఆదివారం తన సోదరుడు అల్లు శిరీష్ కొత్త చిత్రం కోసం జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పుష్ప 2 గురించి అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. పుష్ప-2 సినిమా అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నాడు. అభిమానుల్ని ఉద్దేశించి పుష్ప 1 తగ్గేదేలే అంటే, పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఊర్వశివో రాక్షసివో మా కుటుంబానికి తీపి జ్ఞాపకంలాంటి సినిమా అన్నారు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన చిత్రమది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్.ఎమ్, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల్ని ఉద్దేశించి ‘పుష్ప 1 తగ్గేదేలే అంటే, పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుందన్నారు. దింతో బన్నీ ఫ్యాన్స్ లో ఆనందం నెలకొంది.
పుష్ప-2 మూవీని ఆగస్టులో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. రెండో భాగానికి కూడా సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. వాస్తవానికి తెలుగులో చిత్రీకరించబడిన పుష్ప-1 ది రైజ్ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడి విడుదల చేయబడింది. ఐదు భాషల్లో ఒకేసారి విడుదలైన అల్లు అర్జున్ మొదటి సినిమా పుష్ప.
#PushpaTheRule Aslu Thaggedhele 🤩🔥@alluarjun @PushpaMovie #Pushpa pic.twitter.com/W0Wz30n2SY
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) November 6, 2022