RP హోటల్స్ ఫై అల్లు అర్జున్ ఫాన్స్ దాడి..
హైదరాబాద్ లోని పలు హోటల్స్ ఫై దాడి చేసి కుర్చీలు , అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేసారు
- Author : Sudheer
Date : 07-06-2024 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
కిరాక్ RP ..గత కొద్దీ రోజులుగా మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ గా మారాడు. ఏపీలో కూటమికి సపోర్ట్ చేస్తూ వస్తున్న ఈయన..ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రచారం చేసి వార్తల్లో నిలిచిన ఆయన..ఆ తర్వాత కూడా కూటమి విజయం సాధించడం ఫై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జగన్ ఫై లగే వైసీపీ కి సపోర్ట్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు అల్లు అర్జున్ మద్దతు తెలుపడం ఫై RP కీలక వ్యాఖ్యలు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయాడని..కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని..బన్నీ చేసింది ముమ్మాటికీ తప్పని RP కీలక వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా పలు కీలక కామెంట్స్ కూడా చేసాడు. దీంతో బన్నీ అభిమానుల్లో ఆగ్రహం పెరిగింది. మా హీరోను అంటవని చెప్పి..RP కి చెందిన హోటల్స్ ఫై దాడికి దిగారు. హైదరాబాద్ లోని పలు హోటల్స్ ఫై దాడి చేసి కుర్చీలు , అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేసారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దాడిని కొంతమంది వ్యతిరేకిస్తుంటే..మరికొంతమంది మాత్రం RP కి సలహాలు ఇస్తున్నారు. ఇండస్ట్రీ లో పెద్ద హీరోల జోలికి వెళ్లోద్దని , ముఖ్యంగా మెగా హీరోల జోలికి వెళ్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందని అంటున్నారు.
Allu Arjun Fan’s attached comedian RP
Hotel 🤣🤣🤣 pic.twitter.com/UZzeG4TtB7— Voice of Voice Less (@2029YSJ) June 6, 2024
Read Also : Viral : వామ్మో ఎగిరే పామును మీరు ఎప్పుడైనా చూశారా..?