Pushpa 2 EXCLUSIVE: లుక్ కోసం ట్రైల్స్ వేస్తున్న అల్లు అర్జున్.. పుష్ప క్రేజీ అప్డేట్స్ ఇవే!
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించబోతున్న పుష్ప 2 అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి.
- By Balu J Published Date - 04:37 PM, Thu - 8 September 22
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించబోతున్న ‘పుష్ప 2’ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె ముగిసిన తర్వాత ఈ చిత్ర నిర్మాత వై రవిశంకర్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలియజేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందుకుంది. పుష్ప 2 ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్వింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్ట్2 లో కూడా అందర్నీ ఆకటుకునేలా అల్లు అర్జున్ ఇటీవల లుక్ ట్రయల్స్ చేస్తున్నారు. ఈ నెలలోనే సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారు.
పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక మందన్న కొత్త లుక్‌లో కనిపిస్తారా అని వై రవిశంకర్ని అడిగినప్పుడు.. “చూడండి.. వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ లుక్ బాగుంటుందో, దాన్నే ఫైనల్ చేస్తాం. ఏస్ మేకప్, ప్రొస్తెటిక్ లుక్ డిజైనర్)తో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రీతీషీల్ మొదటి భాగం కోసం కూడా పనిచేసింది. ఖచ్చితంగా లుక్ పల్లెటూరిగా ఉంటుంది. అల్లు అర్జున్ లుక్ పార్ట్ వన్‌లో మాదిరిగానే ఉంటుంది. (కానీ) కొద్దిగా మార్పులు ఉంటాయి” అని చిత్రనిర్మాత పంచుకున్నారు.
షూట్ ప్రారంభం గురించి నిర్మాత మాట్లాడుతూ.. “బహుశా 22 (సెప్టెంబర్) షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం. ఇటీవల సాయి పల్లవి పుష్ప 2లో భాగం కానుందని వార్తలు వచ్చాయి, అయితే వై రవిశంకర్ ఆ వార్తలను ఖండించారు. కాగా అల్లు అర్జున్ పార్ట్-2 చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించాడు. తన మనసులో పుష్ప-2 తప్ప మరేదీ లేదని తెలిపాడు.
Related News
Allu Arjun Pushpa 2 : ఆ భాషలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా పుష్ప 2.. నెవర్ బిఫోర్ రికార్డు..!
Allu Arjun Pushpa 2 బాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా అరుదుగా కొన్ని సినిమాలు బెంగలిలో రిలీజ్ అవుతాయి. అలాంటిది ఒక సౌత్ సినిమా అది కూడా ఒక తెలుగు సినిమా బెంగాలిలో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి