Allu Arjun : అల్లు అర్జున్ డైరెక్టర్ ఛేంజ్.. ఫ్యాన్స్ షాక్..!
తమిళ దర్శకుడు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఒక కథ సిద్ధం చేసుకున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్
- By Ramesh Published Date - 11:05 PM, Mon - 15 July 24

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun Pushpa 2) చేసే సినిమాల మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. పుష్ప 2 తర్వాత త్రివిక్రం తో సినిమా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని అనుకోవట్లేదని తెలుస్తుంది. గురూజీ కూడా స్క్రిప్ట్ రెడీ చేయడానికి కొంత టైం కావాలని అంటున్నాడట. మొన్నటిదాకా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని హడావిడి చేశారు. కానీ రెమ్యునరేషన్ లెక్కల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది.
ఇదిలాఉంటే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా రేసులో కొత్తగా మరో తమిళ దర్శకుడు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఒక కథ సిద్ధం చేసుకున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep kumar).సూపర్ స్టార్ రజినితో జైలర్ (Jailer) లాంటి సినిమా చేసిన ఆయన అల్లు అర్జున్ కోసం కూడా ఒక క్రేజీ స్టోరీ రాసుకున్నాడట. రీసెంట్ గా బన్నీని కలిసి కథ చెప్పినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ దాదాపు నెల్సన్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రజిని ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ మళ్లీ జైలర్ 2 ని తీసే ఆలోచనలో ఉన్నాడు. ఈలోగా అల్లు అర్జున్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ నెల్సన్ కచ్చితంగా ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.
అల్లు అర్జున్ పుష్ప 2 పూర్తి చేశాక నెక్స్ట్ సినిమా కోసం ఎంతో టైం తీసుకోకుండా వెంటనే చేయాలని అనుకుంటున్నాడట. మరి అది నెల్సన్ డైరెక్షన్ లోనే ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని అంటున్నా ఆ సినిమాకు మాత్రం చాలా టైం తీసుకోవాలని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వేటలో ఉన్న అల్లు అర్జున్ కి సరైన దర్శకుడు దొరకట్లేదని టాక్.