Allu Arjun: అల్లు అర్జున్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో.. ఫ్యాన్స్, సెక్యూరిటీ మధ్య చికాకు!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు బన్నీ తీరును తప్పుపడగా, మరికొందరు ఆయనను మద్దతు చేస్తున్నారు.
- By Hashtag U Published Date - 12:01 PM, Sun - 10 August 25

Allu Arjun: సెలబ్రిటీగా ఉన్న అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్ళినా క్రేజ్ అలా ఉంటే సహజం. ఇటీవల ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ పోర్టులో కాస్త ఆసక్తికర పరిస్థితే జరిగింది. మాస్క్, కళ్లజోడుతో బన్నీ ఎయిర్ పోర్టులో ఎంట్రీ ఇచ్చారు. ఎటు నుండి కొందరు ఫ్యాన్స్ ఆయనను “అన్నా” అని పిలిచినా, బన్నీ చేయి ఊపుతూ వెళ్లిపోయారు.
అయితే, సెక్యూరిటీ సిబ్బంది ఆయనను గుర్తించలేక, అసిస్టెంట్ వారు “సార్, ఇది అల్లు అర్జున్” అని చెప్పడంతో మాస్క్ తీసి ముఖం చూపించమని అడిగారు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత బన్నీ మాస్క్, కళ్లజోడు తీసి ముఖం చూపించి లోపలికి అనుమతించారు.
Also Read: Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం పక్కా వ్యూహంతో కాంగ్రెస్..హోంమంత్రి పదవి ‘ఆఫర్’
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు బన్నీ తీరును తప్పుపడగా, మరికొందరు ఆయనను మద్దతు చేస్తున్నారు. ఎయిర్ పోర్టులో రూల్స్ పాటించాల్సిందేనని, ఫ్యాన్స్ ఫోటోల కోసమే ఆయన మాస్క్ వేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బన్నీ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమా చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా మూడు తరాల నాలుగు కీలక పాత్రల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారని, దీపికా పదుకోన్‌తో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందాన వంటి హీరోయిన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.