Faria Abdhullah : చిట్టి అందాలతో చితగ్గొట్టేస్తుందిగా.. బాబోయ్ అనేస్తున్న ఫాలోవర్స్..!
జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఒకటి రెండు ఛాన్సులు అందుకున్నా వాటి వల్ల కెరీర్ లో క్రేజ్ రాబట్టలేకపోయింది.
- By Ramesh Published Date - 07:57 PM, Sat - 10 August 24

Faria Abdhullah గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే మాత్రం ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు గ్లామర్ షోకి ఓకే చెప్పాల్సిందే. కొంతమంది హీరోయిన్స్ కేవలం యాక్టింగ్ మాత్రమే చేస్తాం గ్లామర్ షో చేయము అన్న వారికి తగిన అవకాశాలే వస్తాయ్. మరీ అభినయంతో అదరగొట్టేస్తే తప్ప గ్లామర్ షో చేయనిదే హీరోయిన్స్ మనుగడ ఉండే పరిస్థితి లేదు. అందుకే కథానాయికలు ముందు కాస్త పద్ధతిగా కనిపించినా సరే తర్వాత గ్లామర్ గేట్లు ఎత్తేస్తారు.
ఐతే అందరి దారిలోనే తను అన్నట్టుగా ఉంది జాతిరత్నాలు (Jathiratnalu) చిట్టి పరిస్థితి. జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఒకటి రెండు ఛాన్సులు అందుకున్నా వాటి వల్ల కెరీర్ లో క్రేజ్ రాబట్టలేకపోయింది. ఈమధ్యనే అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించింది ఫరియా. ఐతే అమ్మడు సినిమాలతోనే అంటే కష్టమని భావించి ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.
చిట్టి లేటేస్ట్ గా క్రేజీ ఫోటో షూట్ చేసింది. గ్లామర్ షోని తనలా ఎవరు చేయలేరు అన్నట్టుగా అమ్మడి అందాల ప్రదర్శన ఉంది. తన బోల్డ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఫరియా. అమ్మడు చేసిన ఈ ఫోటో షూట్ వల్ల తన ఫాలోవర్స్ అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు ఇన్నాళ్లు చేసిన సినిమాల వల్ల రాని క్రేజ్ పాపులారిటీ ఈ ఫోటో షూట్స్ వల్ల వస్తున్నాయి. సో ఇలానే గ్లామర్ దట్టించి ఫోటో షూట్స్ చేస్తే ఫరియా కూడా క్రేజీ ఛాన్సులు అందుకునే అవకాశం లేకపోలేదు.
ఫరియా ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చర్చల దశల్లో ఉంది. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. ఐతే ఫరియా కెరీర్ లో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
Also Read : NTR-Allu Arjun : ఒకే వేదిక మీద ఎన్టీఆర్, అల్లు అర్జున్..?