HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Akshay Kumar Charge Huge Remuneration For Manchu Vishnu Kannappa Movie

Kannappa : కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్‌కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఈ లెక్కలో ప్రభాస్..!

కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్‌కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఇక ఈ లెక్కలో ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..!

  • By News Desk Published Date - 08:11 PM, Fri - 10 May 24
  • daily-hunt
Akshay Kumar Charge Huge Remuneration For Manchu Vishnu Kannappa Movie
Akshay Kumar Charge Huge Remuneration For Manchu Vishnu Kannappa Movie

Kannappa : శివుడు మహాభక్తుడైన కన్నప్ప కథతో టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ని మంచు విష్ణు పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో కనిపించబోతుంది.

అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ ఇప్పటికే ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ఇక ఈ నటులు ఈ సినిమాలో నటించేందుకు భారీ పారితోషకాన్ని అందుకున్నారట. వీరిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ నాలుగు రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. ఇక ఈ నాలుగు రోజుల షూటింగ్ కోసం అక్షయ్ దాదాపు రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

కేవలం నాలుగు రోజుల షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ ఇన్ని కోట్లు ఛార్జ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ పారితోషకం వార్త విన్న కొందరు నెటిజెన్స్.. “అక్షయ్ కుమారే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఇక ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో..?” అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ కూడా రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఒక ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ కథతో గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ అనే సినిమా చేసారు. ఆ మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కథతో మంచు విష్ణు సినిమా చేస్తుంటే.. ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshay Kumar
  • Kannappa
  • manchu vishnu
  • prabhas

Related News

    Latest News

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd