Akkineni Nageswara Rao : దేవదాసు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తాగి నటించారా? అలా కనిపించడానికి ఏం చేశారు?
ఈ సినిమా తెరకెక్కించే ముందు చాలా మంది దేవదాసు పాత్రకి అక్కినేని పనికిరారని దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చారట.
- Author : News Desk
Date : 08-06-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే సినిమా దేవదాసు(Devadasu). బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం. వేదంతం రాఘవయ్య(Vedantam Raghavaiah) డైరెక్ట్ చేసిన ఈ సినిమా బై లింగువల్ గా తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషల్లో తెరకెక్కింది. ఇక దేవదాసుగా అక్కినేని, పార్వతిగా సావిత్రి(Savitri) ఈ సినిమాలో నటించారు అనడం కంటే జీవించారు అనడంలో అసలు సందేహం లేదు. అయితే ఈ సినిమా తెరకెక్కించే ముందు చాలా మంది దేవదాసు పాత్రకి అక్కినేని పనికిరారని దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చారట.
కానీ వారు అవేవి పట్టించుకోకుండా సినిమాని తెరకెక్కించారు. రిలీజ్ అయిన తరువాత సినిమా చూసిన ప్రతి ఒక్కరికి దేవదాసు తప్ప అక్కినేని కనిపించలేదు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయగా అందులో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో దిలీప్‌కుమార్ సైతం.. తాను అక్కినేనిలా నటించలేకపోయాను అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పార్వతి దూరం అయ్యిందని దేవదాసు మద్యపానానికి అలవాటు అవుతాడు. దాదాపు మూవీ సెకండ్ హాఫ్ మొత్తం అక్కినేని మద్యం తగిన వాడిలా నటిస్తారు.
అయితే తాగినవాడిలా అక్కినేని సహజ నటన చూసి అప్పటిలో చాలామంది ఆయన నిజంగానే తాగి నటించారని అనుకున్నారు. ముఖ్యంగా ‘జగమే మాయ బ్రతుకే మాయ’ అనే సాంగ్ లో అక్కినేని కళ్ళు, ఒళ్ళు చూసి.. నిజంగానే తాగి ఉంటారని భావించారు. కానీ ఆయన తాగి నటించలేదు. అసలు విషయం ఏంటంటే.. అక్కినేని ఆ షూట్ సమయంలో ఎక్కువ సేపు నిద్రపోకుండా ఉండేవారు. అలాగే షూట్ కి వచ్చే ముందు పెరుగు అన్నం తినేవారట. ఇక ‘జగమే మాయ’ సాంగ్ ని అయితే అర్ధరాత్రి సమయంలో షూట్ చేశారట. దీంతో నిద్రలేకపోవడంతో కళ్ళు మూతపడేవి. అలా ఆ సినిమాలో అక్కినేని నిజంగా తాగినట్లే తెరపై కనిపించారు.
Also Read : Venkatesh : నిజమైన రాబందులను వెంకటేష్ మెడపై పెట్టి పొడిచేలా చేశారు.. ఏ సినిమాలో తెలుసా?