Ajith Accident : హీరో అజిత్ కు మరోసారి కారు ప్రమాదం
Ajith Accident : ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటం అంత ఊపిరి పీల్చుకునేలా చేసింది
- Author : Sudheer
Date : 19-04-2025 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith )కు మరోసారి కారు ప్రమాదం (Car Accident) నుంచి తప్పించుకున్న సంఘటన బెల్జియంలో జరిగింది. “రేసింగ్ కింగ్” అని పేరు పొందిన ఆయన.. ఇటీవల బెల్జియంలో నిర్వహించిన “సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరఛాంప్స్” రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే రేస్ మధ్యలో ఆయన డ్రైవింగ్ చేస్తున్న కారు కంట్రోల్ తప్పి ట్రాక్ నుంచి బయటకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటం అంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఆయన నడిపిన కారు ముందు భాగం మాత్రం తీవ్రంగా దెబ్బతింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయినట్లుగా ఫోటోలు బయటకి వచ్చాయి. రేసింగ్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు సాధారణమే అయినా, అజిత్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఆయన అభిమానులకు హమ్మయ్య అనుకున్నారు.
Guava Leaves: షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకు దివ్య ఔషధం.. ఒక్క ఆకుతో షుగర్ కంట్రోల్ అవ్వడం ఖాయం!
ప్రస్తుతం అజిత్ “విదా ముయర్చీ” అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు రేసింగ్‌పై ఉన్న ప్యాషన్ ఏ మాత్రం తగ్గలేదు. అజిత్‌కు ఇది మొదటి ప్రమాదం కాదు. గతంలో కూడా పలు రేసింగ్ యాక్సిడెంట్స్‌లో ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన తరువాత ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన మేనేజ్‌మెంట్ వెల్లడించింది.