Allu Arjun: అట్లీతో బన్నీ పాన్ ఇండియా మూవీ.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్!
పుష్ప మూవీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.
- By Balu J Published Date - 03:41 PM, Mon - 24 January 22
పుష్ప మూవీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఈ హీరోకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ఆసక్తి రేపుతోంది. బన్నీ నెక్ట్స్ సినిమా ఎంటి? ఎవరి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు? లాంటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కి భారీ మొత్తంలో ఆఫర్ వచ్చింది.
పుష్ప కోసం 75 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్, లైకా ప్రొడక్షన్స్ 100 కోట్లు ఆఫర్ చేసింది. మీడియా నివేదికల ప్రకారం, అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే అధికారికంగా సమావేశమయ్యారు. పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం సాధ్యసాధ్యాల గురించి డిస్కస్ చేశారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్ తో పాటు రజనీకాంత్, ప్రభాస్, తలపతి విజయ్ పోటీ పడుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల మార్కును దాటడంతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ చిత్రం నార్త్ ఏరియాల్లో అద్భుతంగా రన్ అవుతోంది.
ఇదిలా ఉంటే, నయనతార, షారూఖ్ ఖాన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అట్లీ ఓ సినిమా చేస్తున్నాడు. టీమ్ ఇప్పటికే పూణేలో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. త్వరలో తదుపరి షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించాలని ఎదురుచూస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ కోసం రంగంలోకి దిగనున్నాడు. పుష్ప సెకండ్ పార్ట్ మార్చిలో సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags
Related News
Allu Arjun : అల్లు అర్జున్ విషయంపై.. పిఠాపురం వర్మ కామెంట్స్.. తప్పు చేసిన వారికి..
అల్లు అర్జున్, నాగబాబు విషయంపై పిఠాపురం టీడీపీ నేత వర్మ స్పందించారు. రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి గురించి ఆయన మాట్లాడుతూ..