Corona : మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్ కు కరోనా
Corona : "సింగపూర్ వంటి దేశాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, అందుకే మాస్క్‌లు ధరించండి, శానిటైజర్ వాడండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లండి" అంటూ శిల్పా ప్రజలకు సూచించారు
- Author : Sudheer
Date : 19-05-2025 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
మళ్లీ కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అక్క (Mahesh Babu’s wife Namrata Shirodkar’s sister) అయిన శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar)కు కరోనా పాజిటివ్ (Corona Positive) గా నిర్ధారణ అయ్యింది. శిల్పా ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్య పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
శిల్పా శిరోద్కర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, విశ్రాంతి అవసరం అని ఆమె పేర్కొన్నారు. “సింగపూర్ వంటి దేశాల్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, అందుకే మాస్క్‌లు ధరించండి, శానిటైజర్ వాడండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లండి” అంటూ శిల్పా ప్రజలకు సూచించారు. ఆమె ఈ సూచనలతోపాటు, కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అలసత్వం అనర్ధాలకు దారి తీయవచ్చని హెచ్చరించారు.
గతంలో మహేష్ బాబు, నమ్రత కూడా కరోనా బారినపడ్డారు. ఇప్పుడు శిల్పా శిరోద్కర్‌కు కరోనా సోకడం తో మహేష్ కుటుంబం మళ్లీ వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. అభిమానులు శిల్పా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు, కరోనా మళ్లీ విజృంభించకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.