Thammudu : నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో.. ఆ హీరోయిన్ రీ ఎంట్రీ.. హీరోకి అక్కగా..
నితిన్ 'తమ్ముడు' సినిమాతో ఆ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. నితిన్ కి అక్క పాత్రలో..
- By News Desk Published Date - 01:51 PM, Sun - 19 May 24

Thammudu : టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘తమ్ముడు’ అంటూ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ని పెట్టారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కాస్టింగ్ డీటెయిల్స్ ని చిత్ర యూనిట్ ఇంకా తెలియజేయలేదు.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ వార్త ఏంటంటే.. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘లయ’. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించిన లయ.. 2006లో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఇక ఇన్నాళ్లు సినిమా రంగానికి దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు మళ్ళీ మొహానికి రంగు పూసుకొని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఒకటి రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి ‘తమ్ముడు’ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో లయ కనిపించబోతున్నారట. సినిమా కథంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంతో దర్శకుడు వేణు శ్రీరామ్.. ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. మరి ఈ ఎంట్రీతో లయ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
కాగా ఈ సినిమాలో నితిన్ కి జోడిగా కాంతార భామ ‘సప్తమి గౌడ’ నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ కాస్టింగ్ డీటెయిల్స్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.