Actress: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఒకప్పటి హీరోయిన్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 5 March 25

ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అరుదైన వ్యాధి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను ఎదుర్కొని బతికి బయటపడ్డారు. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వింత వింత సమస్యలు తెరపైకి వస్తున్నాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది హీరోయిన్లు సఫర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఒక వార్త వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరోయిన్ మరెవరో కాదు లైలా. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది లైలా. ఇది ఇలా ఉంటే లైలా తాజాగా నటించింది శబ్దం. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె అనేక విషయాల గురించి తెలిపారు.
అలాగే తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్ లైలా 2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెన్ మెహ్దినీని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది. రీసెంట్ టైంలో కార్తి సర్దార్, విజయ్ ద గోట్ చిత్రాల్లో నటించింది. తాజాగా శబ్దం మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో తన నవ్వు వ్యాధి గురించి బయటపెట్టింది. తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయని లైలా చెప్పింది. శివపుత్రుడు షూటింగ్ టైంలో నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని విక్రమ్ ఛాలెంజ్ చేయగా 30 సెకన్లకే ఏడ్చేశానని, దీంతో తన మేకప్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. ఇలా తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.