Hema Visits Tirumala : డ్రగ్స్ పేరు ఎత్తగానే ఆగ్రహం వ్యక్తం చేసిన నటి హేమ
రేవ్ పార్టీ, డ్రగ్స్ గురించి అడిగిన ప్రశ్నకు అసహనం ప్రదర్శించిన హేమ డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు మీరే ఎక్కువ రాస్తుంటారుగా
- Author : Sudheer
Date : 29-06-2024 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా నటి హేమ (Hema )..రీసెంట్ గా బెయిల్ ఫై విడుదలైంది. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా..కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నటి హేమ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చిన మీడియాతో మాట్లాడారు. దర్శనం చాలా బాగా జరిగిందని, చాలా హ్యాపీ అంటూ తెలిపింది. చిన్నప్పటి నుంచి తాను తిరుమల దర్శనానికి వస్తున్నానని ఇది నాకు పుట్టినిల్లు లాంటిదంటూ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు తనకు ఇష్టమైన దేవుడని బ్రహ్మాండంగా దర్శనం జరిగిందని తెలిపారు. ఇదే సందర్బంగా మీడియా వారు రేవ్ పార్టీ, డ్రగ్స్ గురించి అడిగిన ప్రశ్నకు అసహనం ప్రదర్శించిన హేమ డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు మీరే ఎక్కువ రాస్తుంటారుగా… నన్నెందుకు అడగడం అంటూ ఘాటుగా జవాబు ఇచ్చారు.
Read Also : Health Tips : ఉదయం నిద్ర లేవగానే దాహం వేస్తోందా.? ఇది ఆరోగ్య సమస్య కావచ్చు..!