Soniya Singh : డ్రీం కార్ కొన్నానంటూ సోనియా సింగ్ ఎమోషనల్ పోస్ట్.. ఏకంగా బెంజ్ కార్..
తాజాగా సోనియా, తన ప్రియుడు పవన్ కలిసి కాస్టలీ బెంజ్ కార్ కొన్నారు.
- Author : News Desk
Date : 25-03-2025 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
Soniya Singh : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో పాపులర్ అయింది సోనియా సింగ్. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ, టీవీ షోలలో సందడి చేస్తూ వైరల్ అవుతుంది. ఇక మరో నటుడు పవన్ తో ప్రేమలో ఉండి ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది సోనియా .
తాజాగా సోనియా, తన ప్రియుడు పవన్ కలిసి కాస్టలీ బెంజ్ కార్ కొన్నారు. ఆలయం వద్ద తన బెంజ్ కార్ కి పూజలు చేయించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనియా సింగ్.
ఈ ఫోటోలను షేర్ చేసి.. ఒక చిన్న పిల్ల ఒకప్పుడు తన ప్రపంచాన్ని మించి కలలు కంది. దానికోసం ఎన్నో స్ట్రగుల్స్ పేస్ చేసింది. కానీ ఎప్పుడూ ఆపలేదు. చాలా కష్టమైనా ఇప్పుడు దానికి ఫలితం దక్కింది. ఆ లిటిల్ గర్ల్ నేనే. నేను చాలా గర్వంగా ఉన్నాను నేడు. నన్ను నమ్మినవాళ్లందరికి రుణపడి ఉంటాను. మీ ప్రేమ, సపోర్ట్ ఇవాళ ఇది సాధ్యమయ్యేలా చేసాయి. డ్రీమ్స్ ఇప్పుడు నిజమయ్యాయి. జర్నీ కష్టంగా ఉన్నా నేను ఆ డ్రీం రియాలిటీకి మారడానికి కష్టపడ్డాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోనియా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ బెంజ్ కార్ ధర 50 లక్షలపైనే ఉంటుందని సమాచారం.
Also Read : Vijays Last Film: విజయ్ లాస్ట్ మూవీ.. ‘జన నాయగన్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ