Geetha Madhuri Casino Game : క్యాసినో అంటే గీతామాధురి పడి చస్తుంది – నందు
గీత కు ఉన్నక్యాసినో పిచ్చి గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.
- Author : Sudheer
Date : 11-12-2023 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
సింగర్ గీత మాధురి – నటుడు నందు (Actor Nandu & Geetha Madhuri ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఓ కూతురు ఉంది. కాగా గత కొద్దీ రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటె తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నందు మాట్లాడుతూ..గీత కు ఉన్నక్యాసినో (Casino Game) పిచ్చి గురించి చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ” నేను గీతా ఓసారి లండన్‌కు వెళ్లాం.అక్కడ క్యాసినో గేమ్ చూసి ఆమె దాన్ని ఇష్టపడింది. అప్పటికప్పుడు నేర్చేసుకుంది. తను తెలివైన అమ్మాయే కానీ అక్కడ క్యాసినో ఆడి డబ్బులు పొగొట్టుకుంది. ఈ సారి వస్తాయేమో..వస్తాయేమో అని న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఆడింది. ఇలా మూడు నాలుగుసార్లు ఓడిపోయి..పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టింది. నాకు విసుగొచ్చి డబ్బులు విసిరేసి నేను వెళ్లిపోతానంటూ బయటకు వచ్చేశాను.. తను కూడా క్షమించమని అడిగి తను కూడా బయటకు వచ్చింది. క్యాసినో బయట నేను తనను తిడుతుంటే.. అమ్మాయిని వేధిస్తున్నాని అనుకుని పోలీసులు వచ్చారు. మేమిద్దరం భార్యభర్తలమే అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత క్యాసినో ఆడటం తగ్గించేసింది. ఒకవేళ ఆడినా.. రూ. 5-10 వేలు మాత్రమే పెడుతోంది అంతే ” అని నందు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందు తెలిపిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నందు సినీ కెరియర్ విషయానికి వస్తే..ఇటీవల మ్యాన్షన్ 24లో ముఖ్యపాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం అగ్లీ స్టోరీ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read Also : Organ Donation: ఉద్యోగులు భళా.. అవయవ దానానికి 1650 మంది ఉద్యోగుల ప్రతిజ్ఞ