HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actor Nandamuri Balakrishna Injured During The Shooting Of Nbk111

Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 21-07-2026 - 1:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna: Actor Nandamuri Balakrishna injured during the shooting of NBK111.
Balakrishna: Actor Nandamuri Balakrishna injured during the shooting of NBK111.

హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సెట్స్‌లో బాలయ్య గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి.

‘NBK 111’ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు బాలయ్య జారిపడటంతో, ఆయన మోకాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, బాలకృష్ణను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారట. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మోకాలికి స్కానింగ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘NBK 111’ అనేది 1993 బాంబే నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య – గోపీచంద్ కలయికలో రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వృద్ధి సినిమాస్‌ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగులు రాస్తున్నారు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, రవివర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2027 సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nandamuri balakrishna
  • Gopichand Malineni
  • Hindupur MLA Nandamuri Balakrishna
  • Kakinada Port Shooting
  • manchu manoj
  • nandamuri balakrishna
  • NBK111

Related News

Minister Nara Lokesh inquired about the well-being of Nandamuri Balakrishna over the phone after the actor was injured during the shooting of NBK111 in Kakinada.

Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ తన 111వ సినిమా షూటింగ్ లో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అల్లుడు, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. “బాలా మావయ్య త్వరగా కోలుకోవాలి” అంటూ ఆకాంక్షించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK111 చిత్రం తెరకెక్కుతోంది. కాకినాడలో జరుగుతున

    Latest News

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd