Viral Pic : చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్న మాయనే!
"పుష్ప" లో శ్రీవల్లి పాట బాగుంది కదా.. ఇప్పుడు ఈ పాట కూడా హీరోయిన్ రష్మిక అతికినట్టుగా సరిపోతోంది. రీసెంట్ గా రష్మికకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూస్తే..
- By Balu J Published Date - 05:27 PM, Mon - 8 November 21

“పుష్ప” లో శ్రీవల్లి పాట బాగుంది కదా.. ఇప్పుడు ఈ పాట కూడా హీరోయిన్ రష్మిక అతికినట్టుగా సరిపోతోంది. రీసెంట్ గా రష్మికకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూస్తే.. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్న మాయనే! అని మరోసారి పాడుకోక తప్పదు. రష్మిక క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ వల్లి నువ్వు సూపర్ అంటూ వాట్సాప్ డీపీగా పెట్టుకుంటున్నారు. నిజానికి రష్మిక ఫొటో చాలా బాగుంది కూడా. కూర్గ్ ప్రాంతపు అమ్మాయిలు సహజంగానే అందంగా ఉంటారట.
పశ్చిమ కనుమలు రమణీయమైన ప్రకృతి సోయగాలతో పాటు అపురూప సౌందర్యవతులతో అలరారుతుంటాయి. రష్మిక అంటేనే వెలుగు రేఖ.. ‘‘ఆ నవ్వుకు నవరత్నాలు కూడా జెలసీగా ఫీలై ఆ అధరాల నడుమ దరహాస చంద్రికలై మెరిసిపోవాలని ఆరాట పడతాయి’’ అభిమానులు కవిత్వం ఒలబోస్తున్నారు. రష్మిక తన క్యూట్ నటనతో ఆకట్టుకుంటుంది కాబట్టే వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఒకవైపు కుర్ర హీరోలతో నటిస్తూనే, మరోవైపు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. హీరోయిన్ రష్మిక నటిస్తే.. సినిమా హిట్టే అనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ బ్యూటీ మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్ గా మారింది.
హీరోయిన్ రష్మిక పిక్ మాదిరిగా శ్రీవల్లి పాటకు మంచి రెస్సాన్స్ వస్తోంది. మిలియన్లకొద్దీ వ్యూస్ తో ఈ పాటల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్ గాత్రం ఎందరినో అలరిస్తోంది. ఆ గాత్రంలో పలికిన ఆర్ద్రత పూరితమైన మెచ్చుకోలు గుండెను తాకుతోంది. సిద్ స్వరంలో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. కథ, పాత్రల తాలూకు ఎమోషన్స్ ను గళంలో వ్యక్తం చేసే నేటితరం గాయకుల్లో సిద్ అగ్ర స్థానంలో ఉంటాడని చెప్పక తప్పదు.
Happy Diwali fam! 😚
Have fun!
God bless! 🌸💞 pic.twitter.com/KAicNRuwPQ— Rashmika Mandanna (@iamRashmika) November 4, 2021
Related News

Vijay – Rashmika Tweets : ట్విట్టర్ లో రెచ్చిపోయిన విజయ్ – రష్మిక..
థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్