Bigg Boss 6: శ్రీ సత్యకి పడిపోయిన శ్రీహాన్.. హౌస్ లో శ్రీహాన్ ఇక ఉండటం కష్టమే బాబోయ్?
గత సీజన్లో అనగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ సిరి, షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉండడంతో సిరి శ్రీహన్ ను
- By Nakshatra Published Date - 04:09 PM, Fri - 18 November 22
గత సీజన్లో అనగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ సిరి, షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉండడంతో సిరి శ్రీహన్ ను మోసం చేస్తోందని మంచివాడైనా శ్రీహన్ ను కాదనుకొని షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమ నడుపుతుంది అంటూ ఆమెపై బోలెడంత నెగిటివిటీ, నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. శ్రీహాన్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సిరి వదిలేస్తున్నావా అంటూ కన్నీళ్లు పెట్టడంతో అందరూ శ్రీహాన్ తెగ మంచోడు అంటూ పొగిడారు. అయితే శ్రీహాన్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో బాగానే ఉన్నా శ్రీహన్ రాను రాను అతని ప్రవర్తన చాలా దారుణంగా మారింది.
అంతేకాకుండా శ్రీహాన్ అసలు క్యారెక్టర్ బయట పడిపోయింది. హౌస్ లో శ్రీ సత్య కి రోజు రోజుకి మరింత దగ్గర అవుతూ ఆమె చుట్టూ తిరుగుతూ శ్రీ సత్య తానా అంటే తందాన అంటూ ఆమె వెనకాలే పడుతున్నాడు. మొదట్లో బాగానే ఉన్న శ్రీహాన్ శ్రీ సత్య తో ఎప్పుడైతే చేరాడో అప్పటినుంచి మనోడి గేమ్ డల్ అయిపోయింది. అంతేకాకుండా గత వారం అయితే డేంజర్ జోన్ వరకు వెళ్లి వచ్చాడు. గత సీజన్లో షణ్ముఖ్ వల్లే సిరికి నెగెటివిటీ వచ్చింది అన్నది ఎంత నిజమో అదే విధంగా ఇప్పుడు శ్రీ సత్య రిలేషన్ వల్ల శ్రీహాన్ చెడిపోతున్నాడు అన్నది అంతే నిజం. శ్రీ సత్య చేతుల్లో స్నేహాన్ని కీలుబొమ్మగా మారిపోయాడు.
ఇది ఇలాంటి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వీరిద్దరి మధ్య యవ్వారం హైలెట్ చేస్తూ వీళ్ళ కోసం ఏకంగా సాంగ్స్ పెట్టాడు బిగ్ బాస్. ఫ్రీ ఎవిక్షన్ పాస్ లో భాగంగా కంటెస్టెంట్లకు వచ్చిన అవకాశాన్ని శ్రీ సత్య కోసం త్యాగం చేయడానికి రెడీ అయిపోయాడు. అంతేకాకుండా ప్రైజ్ మనీలో 1,50,000 త్యాగం చేసి మరి శ్రీ సత్యను ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించడం కోసం ఫ్రీ ఎవిక్షన్ పాస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత ఆమెతో పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఆ ఎవిక్షన్ ఫ్రీఫాస్ నీకు ఒక్క వారమైన నువ్వు నాతో ఉంటావు కదా నువ్వు ఉన్న వ్యాల్యూ లక్షా 50 కంటే తక్కువే కదా లక్ష యాభై కాదు రెండు లక్షలైనా నువ్వు నాతో ఉంటానంటే నాకు పోయినా పర్లేదు అంటూ బాగానే పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకరికొకరు ప్రేమగా చూసుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి