HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Why Do Banks Keep Hounding You For Credit Cards

క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.

  • Author : Gopi Date : 21-12-2025 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Credit Card
Credit Card

Credit Cards: భారతదేశంలో క్రెడిట్ కార్డ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. వినియోగదారులను ఆకర్షించడానికి బ్యాంకులు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ప్రకటిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ అంటే.. మనం బ్యాంక్ నుండి అప్పుగా డబ్బు తీసుకుని వస్తువులు కొనుక్కుని, సుమారు 45 రోజుల తర్వాత తిరిగి చెల్లించడం. సమయానికి చెల్లిస్తే రివార్డులు వస్తాయి, కానీ బ్యాంకులు మాత్రం భారీ లాభాలను ఆర్జిస్తాయి.

బ్యాంకులు ఎలా సంపాదిస్తాయి?

RBI గణాంకాల ప్రకారం.. 2025 ప్రారంభం నాటికి భారతదేశంలో యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 11 కోట్లు దాటింది. బ్యాంకులు ప్రధానంగా వడ్డీ రేట్లు, వివిధ ఛార్జీల ద్వారా లాభం పొందుతాయి.

భారీ వడ్డీ: ఒకవేళ మీరు బిల్లును సమయానికి చెల్లించకపోతే మిగిలిన మొత్తంపై బ్యాంకులు 15% నుండి 40% వరకు భారీ వడ్డీని వసూలు చేస్తాయి.

ఇతర ఛార్జీలు: యాన్యువల్ ఫీజు, లేట్ పేమెంట్ ఫీజు, EMI కన్వర్షన్ ఫీజు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు వంటి వాటి ద్వారా కూడా బ్యాంకులకు మంచి ఆదాయం వస్తుంది.

Also Read: 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే ఏమిటి?

మీరు క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ దుకాణదారుడు లేదా వ్యాపారి బ్యాంక్‌కు ట్రాన్సాక్షన్ మొత్తంలో 1-3 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ‘ఇంటర్‌ఛేంజ్ ఫీజు’ అంటారు. ఇది నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది.

క్యాష్ అడ్వాన్స్ ఫీజు

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ATM నుండి నగదు విత్ డ్రా చేస్తే బ్యాంకులు 2.5% నుండి 5% వరకు ఫీజు వసూలు చేస్తాయి. దీనికి ఎలాంటి గ్రేస్ పీరియడ్ (అదనపు సమయం) ఉండదు. మీరు డబ్బు తీసిన రోజు నుండే వడ్డీ పడటం మొదలవుతుంది.

ఉదాహరణ: మీరు రూ. 10,000 విత్ డ్రా చేస్తే, 3% ఫీజు అనుకుంటే.. వెంటనే రూ. 300 బ్యాంక్ సంపాదిస్తుంది. దీనికి తోడు రోజువారీ వడ్డీ అదనం.

పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ ఖర్చులు

జనవరి 2025లో భారత దేశంలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు 10.8% పెరిగి రూ. 1.84 ట్రిలియన్లకు (రూ. 1,84,000 కోట్లు) చేరాయి. క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతుంది. ఇది భవిష్యత్తులో లోన్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాష్‌బ్యాక్, లాయల్టీ పాయింట్లు వినియోగదారులను మళ్ళీ మళ్ళీ ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తాయి.

అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BANK
  • business news
  • Credit Card News
  • credit card uses
  • Credit Cards
  • rbi

Related News

Richest Indians

షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.

  • Gratuity

    కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?

  • US-Iran War

    భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్‌!

  • Bank Holiday

    ఈరోజు బ్యాంక్‌ల‌కు హాలిడే ఉందా?

  • ITR Forms AY 2026-27

    పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd