Bank Holidays – July : జులై నెలలో బ్యాంకు సెలవుల లిస్టు ఇదిగో
మరో రోజు తర్వాత క్యాలెండర్ మారిపోనుంది. మనం జులై నెలలోకి ఎంటర్ అవుతాం.
- By Pasha Published Date - 01:36 PM, Sat - 29 June 24
![Bank Holidays – July : జులై నెలలో బ్యాంకు సెలవుల లిస్టు ఇదిగో](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Bank-Holidays-July.jpg)
Bank Holidays – July : మరో రోజు తర్వాత క్యాలెండర్ మారిపోనుంది. మనం జులై నెలలోకి ఎంటర్ అవుతాం. ఆ నెలలో వివిధ బ్యాంకులకు దాదాపు 12 రోజుల పాటు బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ వివిధ రకాల సెలవులు. కొన్ని జాతీయ సెలవులైతే.. మరికొన్ని ప్రాంతీయ సెలవులు. ఈ సెలవులు(Bank Holidays – July) ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ముందస్తుగా కస్టమర్లు తెలుసుకోవాలి. సెలవు ఉన్నప్పుడు బ్యాంకుకు వెళితే.. కస్టమర్ల టైం వేస్ట్ అయిపోతుంది. ముందస్తుగా వచ్చే నెల కోసం ప్లానింగ్ చేసుకునే వారు తప్పకుండా జులై నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల వివరాలను తెలుసుకోవాలి. ఈ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆమోదించింది.
We’re now on WhatsApp. Click to Join
జులైలో బ్యాంకు సెలవుల జాబితా
- జులై 3 (బుధవారం) : ఆరోజు బేహ్ డీఇన్కలమ్ పండుగ ఉంది. మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
- జులై 6 (శనివారం) : ఆ రోజు ‘మిజో హ్మీచే ఇన్సుయిహ్ఖామ్ పాల్’ ఉంది. ఆసందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
- జులై 7న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
- జులై 8 (సోమవారం) : ఆ రోజు కాంగ్ రథ యాత్ర ఉంది. ఆ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు.
- జులై 9 (మంగళవారం) : ఆరోజు బౌద్ధులకు పవిత్రమైన ‘ద్రుక్పా త్షే-జి’ వేడుక ఉంది. ఆ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
- జులై 13 (శనివారం) : ఆ రోజు రెండో శనివారం ఉంది. ఆ సందర్భంగా బ్యాంకులకు హాలిడే.
- జులై 14న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
- జులై 16 (మంగళవారం) : ఆ రోజు హరేలా పండుగ ఉంది. ఆ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని బ్యాంకులకు సెలవు.
- జులై 17 (బుధవారం) : ఆ రోజు మొహర్రం/ అషూరా/ యు తిరోట్ సింగ్ డే ఉన్నాయి. ఆ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే జులై 17న గుజరాత్, ఒడిశా, చంఢీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోం, మణిపుర్, ఇటానగర్, కేరళ, నాగాలాండ్, గోవాలో బ్యాంకులు పనిచేస్తాయి.
- జులై 21న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
- జులై 27 (శనివారం) : ఆ రోజు చివరి శనివారం కనుక బ్యాంకులు పనిచేయవు.
- జులై 28న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
Also Read :Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ
బ్యాంకు సెలవు రోజుల్లో టెన్షన్ పడాల్సిన పనిలేదు. బ్యాంకులు బంద్ ఉన్నప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వాడుకోవచ్చు. యూపీఐ, ఏటీఎం సేవలు ఉండనే ఉన్నాయి. మనం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్ నుంచి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)