Swiggy : స్విగ్గీ కి షాక్ ఇచ్చిన హోటల్ యాజమాన్యాలు
Swiggy : స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టరంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది
- By Sudheer Published Date - 08:37 PM, Fri - 4 October 24

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy )కి ఏపీలోని(AP) హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ (Hotels and Restaurants Association) బిగ్ షాక్ (Big Shock) ఇచ్చింది. ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది. విజయవాడలో ఏపీ హోటల్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.స్వామి, విజయవాడ అసోసియేషన్ అధ్యక్షుడు రమణరావు నేతృత్వంలో అన్ని జిల్లాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టరంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది. నగదు చెల్లింపులు చేయకుండా స్విగ్గీ, జొమాటో ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొంది. గతంలో ఆ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపామని, తమ అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ తెలిపింది. తమకు ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో ఈ సంస్థలు అనేక నిబంధనలు విధిస్తున్నారని, వీటివల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అసోసియేషన్ వాపోయింది. తమకు తెలియకుండానే కాంబో ప్యాకేజీల పేరిట ఆర్డర్లు బుక్ చేస్తున్నారని, వాటికి అయ్యే ఖర్చులు, పన్నులను సైతం తమపైనే వేస్తున్నారని అన్నారు. జొమాటో సంస్థ కొంత వరకు తమ అభ్యంతరాల పరిష్కారానికి ఆసక్తి చూపిందని, కానీ స్విగ్గీ మాత్రం వాయిదా వేస్తూ కాలయాపన చేస్తుంది. అందుకే ఈ నెల 14 నుంచి స్విగ్గీ లో అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also : Bengal’s Durga : నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత ..ఎక్కడో తెలుసా..?