GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!
GST 2.0 : సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు
- By Sudheer Published Date - 07:27 AM, Thu - 4 September 25

వస్తు, సేవల పన్ను (GST) రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చారు. ‘GST 2.0’ పేరుతో ఈ మార్పులు ప్రకటించారు. కొన్ని నిత్యావసర వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించి, మరికొన్నింటిపై పూర్తిగా తొలగించారు. ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను శ్లాబులలో జరిగిన ఈ మార్పులు సామాన్య ప్రజల దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని వస్తువుల GST రేటు 18% నుండి 5%కి తగ్గించారు. ఇందులో సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు వంటి వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా, వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు వంటివి 12% నుండి 5% శ్లాబులోకి వచ్చాయి. ఈ మార్పులు ఈ వస్తువుల ధరలను తగ్గించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సహాయపడతాయి.
Realme P4 vs Pro : రియల్ మీ నుంచి రెండు బ్రాండ్ న్యూ ఫోన్స్.. అదిరిపోయే ఫీచర్స్ వీటి సొంతం
కొన్ని వస్తువులపై GSTని పూర్తిగా తొలగించారు. వ్యక్తిగత, టర్మ్, హెల్త్ బీమా పాలసీలపై గతంలో 18% GST ఉండగా, ఇప్పుడు దాన్ని సున్నాకు తగ్గించారు. అలాగే, మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ (12% నుండి 0%), పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్ నర్స్, పాస్టల్స్ (12% నుండి 0%), ఎక్సర్ సైజ్ బుక్స్, నోట్ బుక్స్ (12% నుండి 0%), మరియు 33 ప్రాణాధార ఔషధాలపై (12% నుండి 0%) కూడా పన్నును తొలగించారు. దీంతో పాటు, ఇండియన్ పరోటా మరియు అన్ని రకాల బ్రెడ్లపై గతంలో ఉన్న 5% GSTని కూడా పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయాలు విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి ముఖ్య రంగాలపై పన్ను భారాన్ని తగ్గించాయి.