Roshni Nadar : కూతురికి ప్రేమతో.. 47 శాతం వాటా రాసిచ్చిన శివ్ నాడార్.. రోష్నీ ఎవరు ?
దీన్నిబట్టి రోష్నీ(Roshni Nadar)కి లభించిన వాటాల రేంజును మనం అర్థం చేసుకోవచ్చు.
- By Pasha Published Date - 12:19 PM, Sat - 8 March 25

Roshni Nadar : కూతురిపై నాన్నకు ఎంత ప్రేమ ఉంటుందో నిరూపించారు హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్. తన ప్రమోటర్ కంపెనీలు వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (ఢిల్లీ), హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌లలోని 47 శాతం వాటాను కూతురు రోష్నీ నాడార్ మల్హోత్రాకు ఆయన గిఫ్టుగా రాసిచ్చారు. ఈ వాటా విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఇంత భారీ సంపదను కూతురికి శివ్ నాడార్ కానుకగా ఇచ్చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇక వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థ ఆషామాషీది కాదు. 2024 అక్టోబరులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ విభాగమైన హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని 100 శాతం వాటాను రూ. 192 కోట్లకు ఈ సంస్థ కొనేసింది. దీన్నిబట్టి రోష్నీ(Roshni Nadar)కి లభించిన వాటాల రేంజును మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ రోష్నీ నాడార్ నెట్ వర్త్ ఎంత ? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్‌డేట్స్
రోష్నీ నాడార్ గురించి..
- రోష్నీ నాడార్(Roshni Nadar) న్యూఢిల్లీలో 1982లో జన్మించారు.
- తల్లిదండ్రుల పేర్లు.. శివ్ నాడార్, కిరణ్ నాడార్.
- 2017 నుంచి 2019 వరకు రోష్నీకి విశిష్ట గుర్తింపు లభించింది. వరుసగా మూడేళ్ల పాటు ‘‘ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితా’’లో ఆమెకు చోటు దక్కింది.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీకి ప్రస్తుతం ఛైర్‌పర్సన్ హోదాలో రోష్నీ నాడార్ ఉన్నారు.
- ప్రస్తుతం మన దేశంలోనే సంపన్న మహిళ మరెవరో కాదు.. రోష్నీయే.
- రోష్నీ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.90వేల కోట్లకుపైనే ఉంటుందట.
- హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ 56 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని నెట్ వర్త్ రూ.1 లక్ష కోట్లకుపైనే.
Also Read :Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!
రోష్నీ భర్త గురించి తెలుసా ?
- రోష్నీ నాడార్ భర్త పేరు శిఖర్ మల్హోత్రా.
- శిఖర్ కువైట్‌లో పుట్టి పెరిగారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.
- శిఖర్‌ది కూడా కువైట్‌లో వ్యాపార కుటుంబమే.
- ప్రస్తుతం హెచ్‌సీఎల్ హెల్త్ కేర్ కంపెనీకి శిఖర్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి మన దేశంలో 5 లక్షలకుపైగా కస్టమర్లు ఉన్నారు.
- హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌లో డైరెక్టర్‌గా, కంపెనీ బోర్డు సభ్యులుగా శిఖర్ ఉన్నారు.