HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Senior Tesla Exec Sreela Venkataratnam Quits Says Working For Musks Firm Not For The Faint Of Heart

Sreela Venkataratnam : ‘టెస్లాలో పనిచేయడం కష్టం’.. వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీలా వెంకటరత్నం రాజీనామా

టెస్లా కంపెనీకి తన రాజీనామా గురించి సోషల్ మీడియా సైట్ ‘లింక్డ్‌ఇన్’ వేదికగా శ్రీలా వెంకటరత్నం కీలక ప్రకటన చేశారు.

  • By Pasha Published Date - 01:11 PM, Sat - 24 August 24
  • daily-hunt
Sreela Venkataratnam Elon Musk

Sreela Venkataratnam : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ప్రపంచమంతా మంచి పేరు వస్తున్నా.. తన కంపెనీల్లోని ఉద్యోగుల దగ్గర మాత్రం మంచి క్రెడిట్ లభించడం లేదు. మస్క్‌కు చాలా స్టార్టప్‌లు ఉన్నాయి. వాటిలోని చాలామంది నిపుణులు ఇప్పటికీ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ట్విట్టర్‌ను మస్క్ కొన్న వెంటనే ఎంతోమంది గుడ్ బై చెప్పారు. మరెంతో మందితో బలవంతంగా రాజీనామాలు చేయించారు. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా నుంచి భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం(Sreela Venkataratnam) వైదొలిగారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయానికి ఆమె టెస్లా కంపెనీలో కీలకమైన వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

టెస్లా కంపెనీకి తన రాజీనామా గురించి సోషల్ మీడియా సైట్ ‘లింక్డ్‌ఇన్’ వేదికగా శ్రీలా వెంకటరత్నం కీలక ప్రకటన చేశారు. ‘‘నేను చేరిన తర్వాతే టెస్లా రూ.58 లక్షల కోట్లు విలువైన కంపెనీగా అవతరించినందుకు  సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు టెస్లాలో పనిచేశాను. ఇక కొంతకాలం విరామం తీసుకుంటాను.  కుటుంబంతో, స్నేహితులతో సరదగా సమయం గడుపుతాను. ఆ తర్వాతే కొత్త అవకాశాల కోసం వెతుకుతాను. ఫ్యామిలీకి నా సమయాన్ని కేటాయించడానికే రాజీనామా చేశాను’’ అని లింక్డిన్‌లో పోస్ట్‌లో శ్రీలా వెంకటరత్నం చెప్పుకొచ్చారు. టెస్లాతో తన ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించినట్లు తెలిపారు. ఈక్రమంలో తోటి ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. అయితే ఆమె పోస్టు కింద కామెంట్‌ పెట్టిన టెస్లా మాజీ సీఎఫ్‌ఓ కామెంట్‌కు శ్రీలా వెంకటరత్నం రిప్లై ఇస్తూ.. ‘టెస్లాలో పనిచేయడం కష్టం’ అని వ్యాఖ్యానించారు. అందుకు ఆయన కూడా నిజమే అని బదులివ్వడం గమనార్హం. ‘‘మంచి పనిచేశావు. టెస్లాలో పనిచేయడం అంత ఈజీ కాదు’’ అని సదరు టెస్లా మాజీ సీఎఫ్‌ఓ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు టెస్లా కంపెనీని వదిలేశారు. ఈ పరిణామం జరిగిన నాలుగు నెలల్లోనే శ్రీలా కూడా బయటికి రావడం అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది.

Also Read :Sonobuoy : భారత సైన్యానికి రూ.442 కోట్ల ‘సోనో బ్యుయ్’‌లు.. ఏమిటివి ?

  • శ్రీలా వెంకటరత్నం 2013 సంవత్సరంలో  టెస్లా కంపెనీలో చేరారు.
  • తొలుత ఆమె డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో సేవలు అందించారు.
  • అనంతరం సీనియర్‌ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది.
  • 2019 నుంచి ఇప్పటివరకు టెస్లా కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా సేవలందించారు.

Also Read :RHUMI 1 Rocket: హైబ్రిడ్ రాకెట్‌ను ప‌రీక్షించిన ఇండియా.. వీడియో ఇదే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elon musk
  • jobs
  • Senior Tesla Exec
  • Sreela Venkataratnam

Related News

Billionaire List

Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

సోమవారం నాడు గూగుల్ (ఆల్ఫాబెట్) షేర్లు 6 శాతం కంటే ఎక్కువ ఎగిసి, $318.57 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లారీ పేజ్ రెండో స్థానానికి చేరుకున్న తర్వాత జెఫ్ బెజోస్ నాల్గవ స్థానం నుండి ఐదవ స్థానానికి పడిపోయారు.

  • Indian Skill Report 2026.

    Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

Latest News

  • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

  • Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

  • Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd