UPI Rule Change : UPI పేమెంట్లు చేసే వారికి న్యూ ఇయర్ గిఫ్ట్
UPI Rule Change : UPI చెల్లింపుల ద్వారా ఇకపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్లలోని సొమ్మును వాడుకునే సదుపాయాన్ని కల్పించింది
- Author : Sudheer
Date : 27-12-2024 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
UPI పేమెంట్లు చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (The Reserve Bank of India (RBI)) శుభవార్తను ప్రకటించింది. UPI (Unified Payments Interface) చెల్లింపుల ద్వారా ఇకపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్లలోని సొమ్మును వాడుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ నిర్ణయం ఫోన్ పే, పేటీఎం వంటి యాప్లలో ఉన్న డిజిటల్, గిఫ్ట్ వ్యాలెట్లను ఇతర యాప్లతో (full-KYC PPIs through third-party UPI apps) సులభంగా అనుసంధానించే అవకాశాన్ని ఇస్తుంది.
ఇప్పటివరకు PPI సంస్థలకు చెందిన UPI ద్వారా మాత్రమే పేమెంట్లు చేసే అవకాశం ఉండేది. కానీ తాజా నిర్ణయంతో థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక యాప్‌కి చెందిన పేమెంట్ వ్యాలెట్లలోని మొత్తాన్ని మరో యాప్ ద్వారా UPI పేమెంట్లకు ఉపయోగించుకోవచ్చు. ఇది వినియోగదారులకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. RBI తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను మరింతగా పెంచనుంది.
ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లు వాడే వ్యక్తులకు ఈ ప్రక్రియ నిమిషాల్లో పూర్తి చేయగల సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. UPI ద్వారా ఇకపై అన్ని రకాల డిజిటల్ ఫండ్స్ అనుసంధానం కుదురుతుంది. ఇది వినియోగదారులకు సమర్థవంతమైన సేవలను అందించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌ను వేగవంతం అవడంతో పాటు UPI సేవల వినియోగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. థర్డ్ పార్టీ యాప్లకు ఇది మరింత విస్తరణ కల్పించడంతో పాటు, వినియోగదారులకి లావాదేవీలు తేలికగా జరిగేలా చేస్తుందని పేర్కొంటున్నారు.
Read Also : Loan App Harassment : యువతి న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు.. ఇద్దరు అరెస్ట్..