Rapido Food Delivery : ‘ర్యాపిడో’ ఫుడ్ డెలివరీ.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ
ఇప్పటికే ఫుడ్ డెలివరీ(Rapido Food Delivery) విభాగంలో జొమాటో పూర్తి పట్టు సాధించింది. రెండో స్థానంలో స్విగ్గీ ఉంది.
- By Pasha Published Date - 02:33 PM, Mon - 28 April 25

Rapido Food Delivery : ర్యాపిడో అనగానే మనకు క్యాబ్ బుకింగ్ సేవలు గుర్తుకు వస్తాయి. ఇకపై ర్యాపిడో ద్వారా మనకు ఫుడ్ డెలివరీ కూడా జరుగుతుంది.ఔను.. మీరు విన్నది నిజమే !! ఫుడ్ డెలివరీ సేవల విభాగంలోకి అడుగు పెట్టాలని ర్యాపిడో భావిస్తోంది. రాబోయే కొన్ని వారాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను బెంగళూరులోని ఎంపిక చేసిన ఏరియాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ర్యాపిడో యోచిస్తోంది.
Also Read :Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
ఒకవేళ ఆశాజనక ఫలితాలు కనిపిస్తే.. తదుపరిగా ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే నగరాలకు ఈ సేవలను ర్యాపిడో విస్తరించనుంది. ఇందుకోసం కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌తో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లతో ర్యాపిడో జట్టు కట్టబోతోందట. ఇప్పటికే ఫుడ్ డెలివరీ(Rapido Food Delivery) విభాగంలో జొమాటో పూర్తి పట్టు సాధించింది. రెండో స్థానంలో స్విగ్గీ ఉంది. ర్యాపిడో కూడా ఎంటరైతే ఈమూడు కంపెనీల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంది.