PhonePe : కస్టమర్లు షాక్ ఇస్తున్న ఫోన్ పే
PhonePe : ఫోన్ పే ఇంతకాలం అత్యంత సులభమైన యూపీఐ యాప్‌గా గుర్తింపు పొందింది. కానీ తాజా అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు పాత వర్షన్‌ను తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు
- By Sudheer Published Date - 05:22 PM, Wed - 12 March 25

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు విశ్వసిస్తున్న యూపీఐ యాప్ ఫోన్ పే (Phonepe ) ఇటీవల పెద్ద మార్పును చేసింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే యాప్‌లో ఇప్పుడు భారీ అప్‌డేట్ వచ్చి, వినియోగదారులను అయోమయానికి గురిచేస్తోంది. స్కాన్ చేసి పేమెంట్ చేసే ఆప్షన్ మినహా, మిగతా ఫీచర్లు అర్థం కాకుండా మారిపోయాయి. దీని వల్ల ఇప్పటికే ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Three-Language Policy : ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి..నాకు 8 భాషలు వచ్చు: సుధామూర్తి
ఈ అప్‌డేట్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు తలనొప్పిగా మారింది. కొత్త ఇంటర్‌ఫేస్ వల్ల తమకు తెలిసిన ఫీచర్లు కనబడటం లేదని, యాప్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. ఇదివరకు సులభంగా పేమెంట్లు చేసేవాళ్లు, ఇప్పుడు అదే పనికి కొత్త ఆప్షన్లను వెతుకుతూ ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఇది అసలు ఫోన్ పే యాప్ కాదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ పే ఇంతకాలం అత్యంత సులభమైన యూపీఐ యాప్‌గా గుర్తింపు పొందింది. కానీ తాజా అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు పాత వర్షన్‌ను తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మార్పులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఫోన్ పే యాజమాన్యం వినియోగదారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా, లేదంటే కొత్త ఇంటర్‌ఫేస్‌ను కేవలం అలవాటు చేసుకోవాల్సిందేనా అన్నది చూడాలి.