HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Olas Bumper Offer Electric Scooter For Just 49999

OLA: ఓలా బంపర్ ఆఫర్.. రూ.49,999కే ఎలక్ట్రిక్ స్కూటర్

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ola March Endiceage
Ola March Endiceage

Electric Scooter  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ మార్చి నెల ఆఫర్‌లో భాగంగా రూ.49,999లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు, రూ.50 వేల విలువైన అదనపు ప్రయోజనాలను సైతం అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. మరి ఈ ఆఫర్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. #EndICEAge అనే ట్యాగ్‌తో ఎండ్ ఐస్ ఏజ్ క్యాంపెయిన్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దీని కింద తన మూడో జనరేషన్కు చెందిన ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్ హవర్ కెపాసిటీ గల స్కూటర్, రోడ్‌స్టర్ ఎక్స్ 2.5 కిలోవాట్ హవర్ టూ-వీలర్ ద్విచక్ర వాహనాలను రూ. 49,999లకే అందిస్తోంది. ఈ రెండు ఎస్1 ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ద్విచక్ర వాహనాల ధరలు రూ. 49,999 నుంచే ప్రారంభమవుతున్నట్లు కంపెనీ తెలిపింది.

అంతే కాదు, ఈ ప్రత్యేక ధర తగ్గింపుతో రూ. 50 వేల వరకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 80 శాతం వరకు వాహనాలకు ఒక రోజులోనే సర్వీసు పూర్తి చేసి పంపిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ఒక వేళ తమ సేవల్లో ఏదైనా ఆలస్యం జరిగినట్లు వినియోగదారులు భావిస్తే, ఓలా క్యాబ్ వోచర్లు ఇస్తున్నామని కంపెనీ వెల్లడించింది. తమ కంపెనీపై వినియోగదారుల్లో విశ్వాసం బలోపేతం చేసేందుకు 60 శాతం వరకు బైబ్యాక్ హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా అన్ని ఓలా ఎస్ 1 స్కూటర్లు, రోడ్‌స్టర్ మోటార్ సైకిళ్లపైనా 8 ఏళ్ల వారంటీ సదుపాయాన్ని కల్పిస్తుట్లు కంపెనీ వెల్లడించింది.

ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది వరకు విద్యుత్తు స్కూటర్ల రంగంలో అగ్రగామిగా కొనసాగింది. అత్యధిక మార్కెట్ వాటాతో దూసుకెళ్లింది. అయితే, ఎప్పుడైతే సంప్రదాయ టూ-వీలర్ల కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల తయారీ రంగంలోకి అడుగుపెట్టాయో అప్పటి నుంచి ఓలా పతనం మొదలైంది. టీవీఎస్, బజాజ్ వంటి సంస్థలు తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటూ వెళ్లాయి. దీంతో ప్రస్తుతం ఓలా మార్కెట్ వాటా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలోని టాప్-5 కంపెనీల జాబితాలోనూ ఓలా ఎలక్ట్రిక్ లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వేలాది షోరూమ్లను ఓలా మూసివేసింది. దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓలా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు, ధరల తగ్గింపు వంటివి తీసుకొస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ మార్చి ఆఫర్ సైతం అందులో భాగమేనంటున్నారు. ఏదేమైనా ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Auto Mobile News
  • Best Electric Scooter
  • buy electric scooter
  • electric scooter
  • ev vechiles
  • ola
  • Special Offer

Related News

Inspire Model Electric Scoo

Electric Scooter: రూ.12,500 కడితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీ సొంతం !!

శక్తివంతమైన బ్యాటరీని ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేస్తే సుమారు 75 నుండి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఆఫీసులకు వెళ్లేవారికి, విద్యార్థులకు మరియు చిన్న వ్యాపారస్తులకు ఇది రోజువారీ ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది

    Latest News

    • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

    • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

    • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

    • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

    • H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd