Investment : భూమి మీద కంటే బంగారం పై పెట్టుబడి పెడితే మంచిదా..?
Investment : ఒక ప్రాంతంలో భూమి ధరలు పెరిగినా, మరొక ప్రాంతంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
- Author : Sudheer
Date : 19-03-2025 - 12:02 IST
Published By : Hashtagu Telugu Desk
పెట్టుబడి విషయంలో చాలా మంది భూమి (Land) లేదా బంగారం(Gold)పై ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా భూమి లేదా ఇళ్లు కొనుగోలు చేయడం ద్వారా భద్రతా భావన కలుగుతుంది. అవి కళ్ల ముందు ఉండటంతో పాటు, రియల్ ఎస్టేట్ లోగడకాలంలో మంచి లాభాలను అందిస్తుందని చాలామంది నమ్మకం. కానీ రియల్ ఎస్టేట్ లాభదాయకత ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక ప్రాంతంలో భూమి ధరలు పెరిగినా, మరొక ప్రాంతంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వృద్ధి ప్రాంతాల్లోనే స్థిరాస్తి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భూమిని విక్రయించాలనుకుంటే సరైన కొనుగోలుదారు దొరకడం కూడా ఒక సమస్య అవుతుంది.
Google Pixel: గూగుల్ అత్యంత చౌకైన ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్!
ఇక బంగారం పెట్టుబడి విషయానికి వస్తే.. ఇది ఎప్పుడూ లాభదాయకమైనదిగా భావించబడుతుంది. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. తక్కువ కాలంలోనే పెట్టుబడి రాబడి అందించే ఆసక్తికరమైన ఎంపిక ఇది. కొన్ని సమయాల్లో బంగారం ధరలు తగ్గినా, అవి తాత్కాలికమేనని అనుభవం చెబుతోంది. బంగారం లిక్విడిటీ కూడా చాలా ఎక్కువ – అంటే, ఎప్పుడైనా సరైన ధర వద్ద విక్రయించుకోవచ్చు. ఇటీవల బంగారం రేటు గణనీయంగా పెరగడం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.
Kennedy Assassination: జాన్ ఎఫ్ కెనడీ హత్య.. సీక్రెట్ డాక్యుమెంట్లు విడుదల.. సంచలన వివరాలు
మొత్తానికి భూమి & రియల్ ఎస్టేట్ దీర్ఘకాల పెట్టుబడి అయితే, బంగారం తక్కువ కాలంలో రాబడులు అందించగల పెట్టుబడి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే భూమి, తక్కువ కాలంలో లాభాల కోసం బంగారం సరైన ఎంపిక. రెండు పెట్టుబడులు తమదైన ప్రయోజనాలను అందిస్తాయి. ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో, ముద్దుబిడ్డలుగా భూమి, బంగారం రెండింటినీ సమతూకంగా పెట్టుబడి పెట్టడం (Investment) ఉత్తమ మార్గం.