Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
- By Pasha Published Date - 02:45 PM, Mon - 20 May 24

Raghuram Rajan : భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘‘జీ20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇదే సమయంలో అత్యంత పేద దేశంగా కూడా’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి మెరుగ్గా 6.5 శాతం మేర ఉంది. దేశంలో జనాభా అధికంగా ఉంది. అందుకే మిగిలిన దేశాల కంటే వేగంగా ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది’’ అని రఘురామ్ రాజన్(Raghuram Rajan) చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లో నిరుద్యోగం రేటు 8.1 శాతం మేర నమోదైందన్నారు. ‘‘దేశ జనాభాలో 37.6 శాతం మంది శ్రామికులే ఉన్నారు. అందుకే జీ20లో వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ పేద దేశంగా కూడా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join
అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ నిర్వహించిన ‘ఆన్ జీపీఎస్:ఇండియాస్ ఎంప్లాయిమెంట్ క్రైసిస్ ‘ అంశంపై నిర్వహించిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘త్వరలో జపాన్, జర్మనీలను దాటి మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రోడ్లు, రైల్వేలను నిర్మిస్తోంది. అయినప్పటికీ దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, చర్చలకు అనువైన స్వేచ్చా వాతావరణ అవసరం ఉంది’’ అని ఆయన తెలిపారు.
Also Read :Israel Revenge : ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ?
ఏటా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో సంపాదన అందిస్తోంది. వాస్తవానికి ఈ సొమ్మును రిజర్వు బ్యాంక్ నుంచి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందుకుంటోంది. ఈ ఏడాది రిజర్వు బ్యాంక్ ప్రభుత్వానికి రూ.లక్ష కోట్లు ఈ ఏడాది డివిడెండ్ రూపంలో అందించనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు ఇది కీలకమైనది. వాస్తవానికి గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.87,416 కోట్లను ఇచ్చింది. ఇది ఆపరేటింగ్ ఖర్చులు, నిబంధనలను లెక్కించిన తర్వాత అంచనా వేసిన డివిడెండ్ RBI బ్యాలెన్స్ షీట్ మిగులుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది అధిక ఆదాయానికి యూఎస్ ఫెడ్ రేట్ల పెంపుతో విదేశీ మారకపు ఆస్తులపై పెరిగిన వడ్డీ ఆదాయం దోహదపడనుంది.