ICICI Credit Card New Rules : ICICI క్రెడిట్ కార్డు వాడే వారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..
ICICI Credit Card New Rules : ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం.. ఇక నుంచి రూ.100 వరకు బిల్ ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ, రూ.101 నుంచి రూ.500 వరకు బిల్ అయితే రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీ ఉంటుంది.
- By Sudheer Published Date - 07:46 PM, Wed - 13 November 24

ప్రస్తుతం ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్స్ (Credit Card) ను వాడుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగించుకునే అవకాశం ఉండడం.. రిటైల్ షాపింగ్, ట్రావెల్, లేదా రెస్టారెంట్లలో డిస్కౌంట్లు మరియు క్యాష్‌బ్యాక్‌లు వంటి సదుపాయలు ఉండడం.. అలాగే సరైన టైంకు చెల్లింపులు చేస్తే, మంచి క్రెడిట్ స్కోర్ పొందే అవకాశం ఉండడం..దీనివల్ల భవిష్యత్తులో లోన్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉండడం తో చాలామంది క్రెడిట్ కార్డ్స్ ను వాడుతున్నారు. అన్ని బ్యాంకులు కూడా ప్రతిఒక్కరికి క్రెడిట్ కార్డ్స్ ను ఇస్తుండడం తో వాడకం మరింత పెరిగింది.
తాజాగా ICICI బ్యాంకు (ICICI Bank) ..తమ క్రెడిట్ కార్డు (ICICI Credit Card) వాడే వారికీ భారీ షాక్ ఇచ్చింది. నవంబర్ 15 నుండి కొత్త రూల్స్ (ICICI Credit Card New Rules) ను అందుబాటులోకి తీసుకవస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం.. ఇక నుంచి రూ.100 వరకు బిల్ ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ, రూ.101 నుంచి రూ.500 వరకు బిల్ అయితే రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీ ఉంటుంది. రూ.501-రూ.1000 వరకు అయితే రూ.500 కట్టాలి. రూ.1001 నుంచి రూ.5 వేల వరకు అయితే రూ.600, రూ.5001 నుంచి రూ.10 వేల వరకు బిల్ ఉంటే రూ.750, రూ.10001 నుంచి రూ.25 వేల బిల్లుపై రూ.900, రూ.25,001 నుంచి రూ.50 వేల బిల్లుపై లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1100గా పెంచేసింది. ఇక ఎడ్యుకేషన్ విషయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులకు 1% ఛార్జీ వర్తింపు చేస్తుంది. స్కూల్/కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇక రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ కార్డ్‌లు యుటిలిటీ చెల్లింపులు, రూ. 80,000 వరకు నెలవారీ ఖర్చులు ఉంటాయి. ఈ పరిమితి వరకు బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను అందించడం కొనసాగిస్తుంది. ఇది కాకుండా ఇతర కార్డులకు ఈ పరిమితి రూ. 40 వేలు. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ వీసా, సఫిరో వీసా, ఎమరాల్డ్ వీసా కార్డ్ హోల్డర్‌లు నెలవారీ కిరాణా ఖర్చు రూ. 40,000 వరకు రివార్డ్ పాయింట్‌లను పొందగలరు. మిగిలిన వారికి ఈ పరిమితి రూ.20 వేలుగా ఉంది.