Godaddy study : బ్లాక్ ఫ్రైడే వేళ..చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్న భారతీయలు : గోడాడీ అధ్యయనం
గోడాడీ చేసిన కొత్త పరిశోధన భారతీయ వినియోగదారుల హాలిడే షాపింగ్ ప్రవర్తనలపై పరిజ్ఙానాన్ని అందిస్తుంది. మరియు చిన్న వ్యాపారాల కోసం అవకాశాలను వెల్లడించింది.
- By Latha Suma Published Date - 06:29 PM, Wed - 13 November 24

Black Friday : ఈ సంవత్సరం వినియోగదారులు తమ స్నేహితులు మరియు కుటుంబాలకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలకు కూడా ఇచ్చే మూడ్ లోనే వున్నారు. గోడాడీ సర్వే ప్రకారం, 86% భారతీయ కోలుగోలుదారులు బ్లాక్ ఫ్రైడే మరియు ఈ సంవత్సరం సెలవుల సీజన్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. (ప్రపంచ సగటు 72%తో పోలిస్తే) వారిలో 23% మంది వరకు 15 శాతం ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ద్రవ్యోల్బణం వినియోగదారుల వ్యయంపై అధిక ప్రభావం చూపుతుండగా భారతీయులు ఆశాజనకంగానే ఉన్నారు. గోడాడీ సర్వే ప్రకారం, 35% మంది భారతీయ వినియోగదారులు ద్రవ్యోల్బణం తమ హాలిడే షాపింగ్‌ను ప్రభావితం చేయదని చెప్పారు, మరో 30% మంది ద్రవ్యోల్బణం తాము షాపింగ్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు.
భారతీయ వినియోగదారుల హాలిడే షాపింగ్‌కు ముఖ్యమైన సమయంగా బ్లాక్ ఫ్రైడే నిరూపించబడింది. సర్వే ఫలితాల ప్రకారం, 62% మంది భారతీయులు తమ హాలిడే షాపింగ్‌లో ఎక్కువ భాగం డిసెంబర్‌లోపు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. భారతీయ వినియోగదారుల షాపింగ్ ప్రవర్తనలో డిజిటల్ ఛానెల్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని గోడాడీ సర్వే వెల్లడించింది. 62% మంది స్పందన దారులు సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఆఫర్‌లను స్వీకరించడానికి ఇష్టపడతామని చెప్పారు.
“సెలవు సీజన్‌లో కస్టమర్‌లను చేరుకోవడానికి, తమ మార్కెటింగ్ వ్యూహాలను త్వరగా అమలు చేయడానికి చిన్న వ్యాపారాలకు సరైన సాధనాలను అందించడానికి గోడాడీ కట్టుబడి ఉంది. డిజిటల్ మార్కెటింగ్ మరియు వెబ్‌సైట్ బిల్డర్ వంటి మా ఉత్పత్తులు సోషల్ మీడియా ప్రచారాలు మరియు ఇమెయిల్ మార్కెటింగ్‌ను సులభంగా ప్రారంభించడంలో సహాయపడతాయి” అని గోడాడీ ఇండియా. సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్, అపూర్వ పల్నిట్కర్ అన్నారు.