Gold Price : భారీగా తగ్గిన బంగారం
Gold Price : అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 40 డాలర్లు తగ్గి, 3112 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 31.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది
- By Sudheer Published Date - 11:53 AM, Fri - 4 April 25

ఇటీవల బంగారం ధరలు (Gold Price) ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వినియోగదారులు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం కొనడం తప్పనిసరి అయినా, ఆల్ టైం గరిష్ఠ రేట్ల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. దీంతో దేశీయంగా కూడా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 40 డాలర్లు తగ్గి, 3112 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 31.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది. అయినా కూడా హైదరాబాద్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు పెరిగినట్టు సమాచారం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 540 పెరిగి రూ. 93,380కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 85,600గా నమోదైంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వినియోగదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ. 2000 తగ్గి రూ. 1,12,000కి దిగివచ్చింది. ఈ ధరలు ఏప్రిల్ 4 ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవి. అయితే రోజంతా మార్కెట్‌లో మార్పులు సంభవించే అవకాశముంది. జీఎస్టీతో పాటు ఇతర పన్నులు ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేసే ముందు తాజా రేటును తెలుసుకోవడం చాలా ముఖ్యం.