Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్
Good News : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి
- By Sudheer Published Date - 05:30 PM, Tue - 14 October 25

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గృహ రుణాలపై భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో పలు బ్యాంకులు తమ MCLR (Marginal Cost of Funds based Lending Rate) రేట్లను తగ్గించాయి. ముఖ్యంగా HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంక్ లు వడ్డీ రేట్లను తగ్గిస్తూ వినియోగదారులకు ఊరట కల్పించాయి. దీనివల్ల గృహ రుణాల EMIలు తక్కువై, హోమ్ బయ్యర్లకు కొంత ఊపిరి లభించింది.
Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు
తాజా సవరణల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కనిష్ఠంగా 7.85 శాతం నుండి గరిష్ఠంగా 8.75 శాతం వరకు ఉన్నాయి. IDBI బ్యాంక్ లో రేట్లు 8 శాతం నుండి 9.70 శాతం మధ్యలో ఉండగా, ఇండియన్ బ్యాంక్ లో 7.95 నుండి 8.85 శాతం మధ్య రేట్లు అమల్లోకి వచ్చాయి. అలాగే HDFC బ్యాంక్ లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.40 నుండి 8.65 శాతం వరకు ఉన్నాయి. బ్యాంకులు తమ MCLR స్లాబ్‌లను (ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరం టెన్యూర్ ఆధారంగా) తగ్గించడంతో రుణగ్రహీతలకు నెలవారీ EMIలు తగ్గడం ప్రారంభమైంది.
ఫైనాన్స్ నిపుణుల ప్రకారం, RBI స్థిరమైన రెపో రేట్ నిర్ణయం వలన మార్కెట్‌లో వడ్డీ స్థిరత్వం కొనసాగుతుందని, హౌసింగ్ రంగానికి ఇది పెద్ద ప్రోత్సాహమని భావిస్తున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గృహ కొనుగోళ్ల ఉత్సాహం పెరుగుతున్న తరుణంలో, ఈ రేట్ల తగ్గింపు మరింత డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, EMI తగ్గడంతో వినియోగదారుల ఆర్థిక భారం తగ్గి, సేవింగ్స్ పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంకులు ఇప్పటికే ఈ కొత్త వడ్డీ రేట్లను తక్షణమే అమల్లోకి తీసుకురావడంతో, వినియోగదారులు ఈ సడలింపులను పొందడం ప్రారంభించారు.