DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన ప్రభుత్వం!
కేంద్ర ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచాలని కూడా నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. "2026-27 రబీ సీజన్‌లో అంచనా వేసిన సేకరణ 297 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 05:59 PM, Wed - 1 October 25

DA Hike: దీపావళి పండుగకు ముందుగా కేంద్ర ప్రభుత్వం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike)ను 3 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తుంది.
48 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
కేంద్ర ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలను దీపావళికి ముందు అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లిస్తారు. ఈ పెంపుతో డీఏ రేటు బేసిక్ జీతం, పెన్షన్‌లో 55 శాతం నుండి 58 శాతానికి పెరిగింది. ఈ పెంపు ఏడవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అలాగే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పెంపుదల వల్ల దాదాపు 49.2 లక్షల మంది ఉద్యోగులకు, 68.7 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏను సవరిస్తుంది. ఇది ఈ సంవత్సరం రెండో డీఏ పెంపుదల. ఏడవ వేతన సంఘం కింద ఇది చివరి సవరణ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
57 కొత్త కేంద్రీయ విద్యాలయాలకు (KV) ఆమోదం
దీంతో పాటు కేంద్ర మంత్రివర్గం 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రివర్గం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలకు (KV) ఆమోదం తెలిపింది. ఇందులో 20 KVలు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలు లేని జిల్లాల్లో, 14 KVలు ఆకాంక్షిత జిల్లాల్లో, 4 KVలు వామపక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల్లో, 5 KVలు ఈశాన్య/కొండ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించబడ్డాయి” అని తెలిపారు.
రబీ పంటల MSP పెంపు నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచాలని కూడా నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. “2026-27 రబీ సీజన్‌లో అంచనా వేసిన సేకరణ 297 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉంది. ప్రతిపాదిత MSP ప్రకారం రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ. 84,263 కోట్లుగా అంచనా వేయబడింది” అని తెలిపారు.