Cancer Medicines: వీటిపై కస్టమ్ డ్యూటీ రద్దు.. క్యాన్సర్ బాధితులకు ఊరట..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మూడు క్యాన్సర్ మందులపై (Cancer Medicines) కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు.
- By Gopichand Published Date - 08:35 AM, Wed - 24 July 24

Cancer Medicines: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మూడు క్యాన్సర్ మందులపై (Cancer Medicines) కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన తర్వాత ఈ మూడు మందుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో క్యాన్సర్ బాధితులకు వైద్యం చేయడంతోపాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఈ మూడు క్యాన్సర్ ఔషధాలు.. ట్రాస్టూజుమాబ్ డెరుక్స్టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్. ఇంతకుముందు ఈ మూడు క్యాన్సర్ మందులపై 10 శాతం కస్టమ్ డ్యూటీ విధించేవారు. ఇప్పుడు అది జీరో శాతానికి తగ్గించారు.
ట్రాస్టూజుమాబ్ డెరుక్స్టెకాన్
ఈ క్యాన్సర్ ఔషధం అమెరికా, ఐరోపాలో అందుబాటులో ఉంది. ఇది రొమ్ము క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుంది. ఈ ఔషధాన్ని ఆస్ట్రాజెనెకా తయారు చేసింది. అదే కంపెనీ కరోనాకు వ్యాక్సిన్‌ను కూడా తయారు చేసింది. ట్రాస్టూజుమాబ్ డెరుక్స్టెకాన్ Enhartu పేరుతో నమోదు చేసింది. ఇప్పుడు ఈ ఔషధం అదే పేరుతో ప్రజాదరణ పొందింది. 100mg మోతాదులో లభిస్తుంది. ఈ ఔషధం వాణిజ్య ప్యాక్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని వైద్యులు.. చికిత్స కోసం అమెరికా నుండి ఈ మందును దిగుమతి చేసుకోవాలి. దీని ఖరీదు దాదాపు రూ.3 లక్షలు.
Also Read: Credit Cards : ఈ క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్ను చెల్లిస్తే రివార్డ్స్
ఒసిమెర్టినిబ్
ఈ ఔషధం ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ప్రోటీన్లను అడ్డుకుంటుంది. ఈ ఔషధం ఉపయోగం క్యాన్సర్ వ్యాప్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దానిని నివారించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ఔషధాలను విక్రయించే కంపెనీల ప్రకారం.. ఒసిమెర్టినిబ్ 10 మాత్రలు కలిగిన ఒక షీట్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు.
We’re now on WhatsApp. Click to Join.
దుర్వాలుమాబ్
ఊపిరితిత్తులు, పిత్తాశయ క్యాన్సర్‌కు ఇది ఔషధం. దుర్వాలుమాబ్ అనేది PD-L1 ప్రోటీన్‌ను నిరోధించే ఇమ్యునోథెరపీ ఔషధం. ఇది రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ చికిత్సలో కూడా దీనిని ఉపయోగిస్తారు. రెండు డోసుల దుర్వాలుమాబ్ ధర రూ.1.5 లక్షలు ఉంటుందని ఆన్‌లైన్ మందుల విక్రయదారులు చెబుతున్నారు.