మరో నాల్గు రోజుల్లో ‘Amazon Great Freedom Festival Sale ‘
ఈ సేల్ లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ తో వివిధ వస్తువులను కొనుగోలు చేయొచ్చని పేర్కొంది
- By Sudheer Published Date - 03:33 PM, Fri - 2 August 24

ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్..మరో నాల్గు రోజుల్లో ‘Amazon Great Freedom Festival Sale ‘ ను తీసుకరాబోతుంది. మూడు నెలలు ఒకోసారి పలు పేర్లతో డిస్కౌంట్ ‘ Sale ‘ ను అందిస్తూ ..కస్టమర్లను ఆకట్టుకుంటూ వచ్చే అమెజాన్..ఈ నెల 6 నుండి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ తో వివిధ వస్తువులను కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. అంతే కాదు కేవలం రూ.49 ప్రారంభ ధరతోనే అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించి కస్టమర్లను మరింత ఆకట్టుకుంది. ఆఫర్లతో పాటు SBI కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎలక్ట్రానిక్ పరికరాలు, హోం అప్లియెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ , స్మార్ట్ వాచ్ తదితర వస్తువులపై కళ్లుచెదిరే ఆఫర్లు ఉండనున్నాయని అమెజాన్ తన సేల్ పేజీలో తెలిపింది. రూ.999కే ఈ సేల్ లో స్మార్ట్ వాచ్, హోమ్, కిచెన్ అప్లియెన్సెస్ కేవలం రూ.79 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. ట్రావెల్ బుకింగ్స్ ను సైతం 40 శాతం వరకు డిస్కౌంట్ తో చేసుకోవచ్చు. బుక్స్, టాయ్స్, గేమింగ్ వస్తువులను సైతం 49 రూపాయల ప్రారంభ ధరతో ఉండనున్నాయి. ఇక దస్తులు, ఫుట్ వేర్, బ్యూటీ వస్తువులపై సైతం ఎప్పుడూ లేనంతగా ఈ సేల్ లో ఆఫర్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ఇక మధ్యతరగతి ప్రజలు ఆలోచించే స్మార్ట్ టీవీలపై కూడా భారీ ఆఫర్లు ఉండనున్నాయని తెలిపింది. ఓవరాల్ గా ఈ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ లో భారీ ఆఫర్లతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి నుండే మీకు ఏ వస్తువులు కావాలో లిస్ట్ సిద్ధం చేసుకోండి.
Read Also : BRS MLA U-Turn: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి