Nidigunta Aruna : పోలీసుల అదుపులో నిడిగుంట అరుణ
Nidigunta Aruna : నిడిగుంట అరుణ(Nidigunta Aruna)ను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణపై కోవూరు ప్రాంతంలో ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసు నమోదైంది
- Author : Sudheer
Date : 20-08-2025 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
నెల్లూరు జిల్లాలో మరోసారి రౌడీషీటర్ శ్రీకాంత్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రియురాలు నిడిగుంట అరుణ(Nidigunta Aruna)ను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణపై కోవూరు ప్రాంతంలో ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసు నమోదైంది. ఆమెను కోవూరు పోలీసు స్టేషన్‌కు తరలించి, నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. నాలుగు రోజుల క్రితం కోవూరు సీఐకి ఫోన్ చేసి, హోంశాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి బెదిరింపులు చేసినట్టు సమాచారం.
ISRO: 40 అంతస్తుల ఎత్తైన జంబో రాకెట్
జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహకారంతో అరుణ పలు అక్రమ కార్యకలాపాలు, సెటిల్మెంట్లలో పాలుపంచుకున్నట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ బెదిరింపులు, ప్లాట్లపై వివాదాలు, డబ్బు లావాదేవీలతో సంబంధం ఉన్న కేసుల్లో ఆమె పేరు అనేకసార్లు వినిపించింది. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా వేసి, అరుణ కదలికలను గమనిస్తూ వచ్చారు. చివరికి అద్దంకి వద్ద ఆమెను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం అరుణపై జరుగుతున్న దర్యాప్తుతో పాటు శ్రీకాంత్ నెట్‌వర్క్‌ను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఆమె ఫోన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. నిఘా వర్గాలు కూడా ఈ కేసును సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అరుణ నుంచి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.