Air India : బంఫర్ ఆఫర్..రూ.1444కే విమాన టిక్కెట్..
Air India : నవంబర్ 13వ తేదీ వరకు ఈ ఫ్లాష్ సేల్‌లో ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకోనే అవకాశం ఎయిర్ ఇండియా ఇచ్చింది. ఈ స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఈ నెల 19వ తేది నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ చేయొచ్చు.
- Author : Latha Suma
Date : 12-11-2024 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
Flash sale : బస్సు టిక్కెట్ ధరకే ఫ్లైట్ టిక్కెట్‌ను అందిస్తూ..ఎయిర్ ఇండియా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నవారు రూ.1444కే ఫ్లైట్ జర్నీ చేయడమే కాదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాస్ సేల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 13వ తేదీ వరకు ఈ ఫ్లాష్ సేల్‌లో ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకోనే అవకాశం ఎయిర్ ఇండియా ఇచ్చింది. ఈ స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఈ నెల 19వ తేది నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఎప్పుడైనా జర్నీ చేయొచ్చు.
ఆరు నెలల వరకు సమయముంటుంది. ఈ శీతాకాలంతో పాటు వచ్చే వేసవికాలంలో టూర్ వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం కానుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌లో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్‌ప్రెస్ లైట్ ద్వారా రూ.1444కే ఫ్లైట్ జర్నీ ఉంటుంది. అలాగే, కొన్ని రూట్లలో ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఆఫర్ ద్వారా రూ.1599కే టికెట్లు పొందొచ్చు. దీంతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.కామ్‌లో లాగిన్ అయ్యేవారికి జీరో కన్వీనియన్స్ ఫీ ఉంటుందని కూడా ఎయిర్ ఇండియా ప్రకటించింది. లగేజీలకూడా ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌లో ఎక్స్‌ట్రాగా 3 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. 15 కిలోలు దాటితే రూ. 1000 చెల్లించాలి. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో అయితే ,20 కిలోల లగేజీకి రూ.1300 కట్టాలి.