Aadhaar Free Update: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే ఛాన్స్!
ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ 2025 జూన్ 14.
- By Gopichand Published Date - 12:55 PM, Wed - 11 June 25

Aadhaar Free Update: ఆధార్ కార్డ్ ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ ఇది ముఖ్యమైన డాక్యుమెంట్. దీని ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వేతర పనులతో సహా అనేక పనులు జరుగుతాయి. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ (Aadhaar Free Update) తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండటం మాత్రమే కాకుండా అది అప్డేట్ అయ్యి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆధార్ కార్డ్‌లో వ్యక్తి పుట్టిన తేదీ, పేరు, చిరునామా, ఇతర సమాచారం సరిగ్గా ఉండాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ చిరునామా ఉండాలి. వివాహం జరిగి ఇంటిపేరు మారినట్లయితే దానిని కూడా ఆధార్‌లో అప్డేట్ చేయడం అవసరం. పుట్టిన తేదీలో లోపం ఉంటే దానిని కూడా సరిచేయించుకోవాలి.
ప్రతి 10 సంవత్సరాలకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకారం.. ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ చేయకుంటే సమస్యలు రావొచ్చు. ముఖ్యమైన పత్రాలలో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆధార్ ఇంకా అప్డేట్ చేయలేదు లేదా అప్డేట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే జూన్ 14లోపు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. లేకపోతే తర్వాత రుసుము చెల్లించి ఈ పని చేయాల్సి ఉంటుంది.
ఉచిత ఆధార్ అప్డేట్ చివరి తేదీ
UIDAI ప్రకారం.. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ 2025 జూన్ 14. గతంలో ఈ అప్డేట్ 2024 డిసెంబర్ 14 చివరి తేదీగా ఉండగా.. ఆ తర్వాత జూన్ 14 చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటివరకు ఈ చివరి తేదీని పొడిగించలేదు.
ఇంకా అవకాశం ఉంది
ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14.. శనివారం వరకు అవకాశం ఉంది. దీని కోసం మీరు ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించాలి. ఆ తర్వాత ఆధార్‌లోని తప్పులను సరిచేయవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అంతేకాకుండా.. myAadhaar యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి, లాగిన్ చేసి ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.