Cars: పెట్రోల్,డీజిల్.. ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేయాలో తెలియక ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే?
మామూలుగా కారు కొనేటప్పుడు చాలామందికి పెట్రోల్ కారు కొనాలా, లేక డీజిల్ కార్ కొనాలా అన్న విషయంపై కాస్త సందేహాలు అనేక రకాల అనుమానాలు ఉంటాయి
- By Anshu Published Date - 05:29 PM, Mon - 24 June 24

మామూలుగా కారు కొనేటప్పుడు చాలామందికి పెట్రోల్ కారు కొనాలా, లేక డీజిల్ కార్ కొనాలా అన్న విషయంపై కాస్త సందేహాలు అనేక రకాల అనుమానాలు ఉంటాయి. కారు కొనుగోలు చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి మొదట వచ్చే ఆలోచన ఇదే. దీని తర్వాత ఫీచర్లు ధర లాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కేవలం ఉన్నత కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కార్లను ఉపయోగిస్తున్నారు.
మరి పెట్రోల్ కార్ కొనాలా లేకుంటే డీజిల్ కారు కొనాలా అనే మీరు కూడా తికమక పడుతున్నారా. మరి ఏది కొనుగోలు చేయాలి రెండింటి ప్రత్యేకత ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెట్రోల్, డీజీల్ ఇలా వేరియంట్స్‌కు వాటి వాటి ప్రత్యేకతలు ఉంటాయి. పెట్రోల్‌తో పోల్చితే డీజిల్ తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది డీజీల్ కార్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే పెట్రోల్ వేరియంట్ కార్ల ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ధర విషయానికొస్తే డీజిల్ కార్లతో పోల్చితే పెట్రోల్ కార్లు చౌకగా ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ అయితే పెట్రోల్ కారును ఎంపిక చేసుకోవడం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
ఇక పెట్రోల్ వాహనాలు డిజైన్ పరంగా చూస్తే సింపుల్‌గా ఉంటాయి. వీటి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు విడి భాగాలు కూడా మార్కెట్ లో సులభంగా లభిస్తాయి. అలాగే రెగ్యులర్ గా చేసే సర్వీసింగ్ కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్‌తో పోల్చితే స్మూత్‌గా ఉంటుంది. డీజిల్ ఇంజన్ కంటే పెట్రోల్ ఇంజన్ తక్కువ శబ్ధం చేస్తుంది, తక్కువ వైబ్రేషన్ కలిగి ఉంటుంది. ఇది మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి పెట్రోల్ వేరియంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మెలైజీ పరంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి. అయితే లాంగ్ జర్నీలకు మాత్రం డీజిల్ కార్లు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.