Car Tips: పెట్రోల్ నింపే కారులో డీజిల్ నింపితే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రస్తుతం మనం ఇంధనంతో నడిచే కార్లు ఎన్నో చూస్తున్నాము. ఇందులో కొన్ని పెట్రోల్ తో నడిస్తే మరికొన్ని డీజిల్ తో నడుస్తాయి. ఈమధ్య కాలంలో ఇంధన ధ
- By Nakshatra Published Date - 05:21 PM, Fri - 19 May 23

ప్రస్తుతం మనం ఇంధనంతో నడిచే కార్లు ఎన్నో చూస్తున్నాము. ఇందులో కొన్ని పెట్రోల్ తో నడిస్తే మరికొన్ని డీజిల్ తో నడుస్తాయి. ఈమధ్య కాలంలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ కార్ల వైపే ఆసక్తిని చూపిస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఒకవేళ మనం ఉపయోగించే పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ విషయంలోకి వెళితే.. పెట్రోల్ పంపులో ఇలాంటి పొరపాట్లు కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి.
అలా డీజిల్ కారులో పెట్రోల్ నింపడం సాధారణ తప్పు. కానీ, ఇది జరిగితే ఏమి చేయాలి? మరి ఇది కారుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.. పెట్రోల్ కారులో డీజిల్ ఎక్కువసేపు పనిచేయదు. కాబట్టి, అది కారులోనే ఆగిపోతుంది. పెట్రోల్ వంటి స్పార్క్‌ను డీజిల్ అందించలేనందున, కారును స్టార్ట్ చేయడం కష్టమవుతుంది. దీని వల్ల ఇంజిన్‌కు పెద్దగా నష్టం జరగదు, కానీ అలా చేయడం హానికరం. పెట్రోల్ ఇంజిన్‌కు ప్రత్యేక స్పార్క్ ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌లో అలాంటి స్పార్క్ ఉండదు.
అలాగే పెట్రోల్ ఇంజిన్ కారులో కార్బ్యురేటర్ ఉంటుంది. అయితే అది డీజిల్ ఇంజిన్‌లో ఉండదు. పెట్రోల్ ఇంజన్లు గాలికి భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్ కారులో పెట్రోల్ పోయడం వల్ల కారులోని యంత్ర భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా ఇంజిన్‌పై దుష్ప్రభావం పడుతుంది. డీజిల్ కారును పెట్రోల్ తో నడిపితే ఇంజన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పెట్రోల్ బంకు వెళ్లినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. అలా జరిగినప్పుడు అది ఇంజన్ పై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.

Related News

Petrol Diesel Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. మీ ఫోన్ లో ఒక క్లిక్ తో రేట్స్ తెలుసుకోండిలా..!
క్రూడాయిల్లో హెచ్చుతగ్గుల మధ్య పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Price Today)ను చమురు కంపెనీలు విడుదల చేశాయి.