Maruti Suzuki Cars: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి రానున్న మారుతీ మోడల్ కార్లు ఇవే..
నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్.. 2024లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ ను ఇ్పటికే జపాన్ లో లాంచ్ చేశారు. భారత్ లో విడుదలయ్యేది స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్.
- By News Desk Published Date - 08:25 PM, Sat - 30 December 23
Maruti Suzuki Cars: కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలైంది. యావత్ ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలను అంబరాన్నంటేలా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి భారత మార్కెట్లో మరిన్ని కొత్త కార్లను ఆవిష్కరించనుంది..
2023లో మారుతి సుజుకి ఈవిక్స్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. ఈవీఎక్స్ ప్రొడక్షన్ వెర్షన్ 2024లో విడుదల కానుంది. మారుతి సుజుకి 2024లో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్
నెక్ట్స్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్.. 2024లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ ను ఇ్పటికే జపాన్ లో లాంచ్ చేశారు. భారత్ లో విడుదలయ్యేది స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ మోడల్. ఈ మోడల్ లో డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో జెడ్-సిరీస్ ఇంజిన్ ను అమర్చారు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ కె-సిరీస్ పవర్ ట్రెయిన్ కు ఇది ప్రత్యామ్నాయం.
మారుతి సుజుకి ఈవీఎక్స్
ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి కాస్త ఆలస్యంగానే వచ్చిందని చెప్పొచ్చు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో లో మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. 2024లో భారత్ లో మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారుగా ఈవీఎక్స్ ను ఆవిష్కరించనుంది. ఇది 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 4300 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్లు, 1600 మిల్లీమీటర్ల ఎత్తుతో, ఇది యూవీల ప్రామాణిక పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది. మారుతి సుజుకి ఈవీఎక్స్ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్ యూవీ 400 వంటి మోడల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్. సెడాన్, కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లలో అమ్మకాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఈ మోడల్ స్థిరమైన అమ్మకాలను కొనసాగించగలిగింది. టాక్సీ సెగ్మెంట్ లో ఈ మోడల్ కు ఉన్న స్థిరమైన డిమాండ్ దోహదపడింది. సుజుకీ డిజైర్ కు కూడా 2024లో అప్డేట్ రానుంది.
Related News
New Maruti Suzuki Swift: లీటర్ పెట్రోల్‌తో 40 కిలోమీటర్లు.. మే 9న మార్కెట్లోకి, బుకింగ్స్ ప్రారంభం
ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేదా అరేనా డీలర్షిప్ నుండి రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.