Jupiter 125 CNG : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్.. ‘జూపిటర్ 125 సీఎన్‌జీ’ ఫీచర్లు ఇవీ
దీనికి ‘జూపిటర్ 125 సీఎన్‌జీ’ (Jupiter 125 CNG) అని పేరు పెట్టింది.
- By Pasha Published Date - 04:09 PM, Sat - 18 January 25

Jupiter 125 CNG : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్ వచ్చేసింది. దీన్ని తయారు చేసింది ఏ కంపెనీయో తెలుసా ? మన దేశానికి చెందిన టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీనికి ‘జూపిటర్ 125 సీఎన్‌జీ’ (Jupiter 125 CNG) అని పేరు పెట్టింది. తాజాగా ‘భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025’లో ఈ స్కూటరును టీవీఎస్ కంపెనీ ప్రదర్శించింది. ఇథనాల్‌తో నడిచే ‘టీవీఎస్ రైడర్ 125’ వర్షన్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది. ఐక్యూబ్ విజన్ కాన్సెప్ట్ స్కూటీ, అపాచీ ఆర్‌టీఎస్ఎక్స్‌ను సైతం ప్రదర్శించింది. ఇక ఫ్రీడమ్ 125 (Freedom 125) పేరుతో తొలి సీఎన్‌జీ బైక్‌ను ఇప్పటికే టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు తొలిసారిగా సీఎన్‌జీతో నడిచే స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ ఏడాది చివర్లోగా ‘జూపిటర్ 125 సీఎన్‌జీ’ స్కూటరును మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read :Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
జూపిటర్ 125 సీఎన్‌జీ స్కూటరులోని విశేషాలివీ..
- ఈ స్కూటరులో 124.8 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ బై ఫ్యూయల్ ఇంజిన్. బై ఫ్యూయల్ అంటే రెండు రకాల ఇంధనాలపై ఇది నడవగలదు.
- ఈ స్కూటరులో 2 లీటర్ల కెపాసిటీ కలిగిన పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. దీంతోపాటు 1.4 కిలోల సామర్థ్యం కలిగిన సీఎన్‌జీ సిలిండర్ ఉంటుంది.
- స్కూటరు ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉంటుంది. సీఎన్‌జీ నాజిల్ సీటు వద్ద ఉంటుంది.
- ఒకవేళ దీనిలోని సీఎన్‌జీ ట్యాంకు, పెట్రోల్ ట్యాంకు రెండూ ఫుల్ చేసుకుంటే 226 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.
- ఇది 7.2 హార్స్ పవర్‌తో నడుస్తుంది.
- 9.4 Nm పీక్ టార్క్‌ను ఈ స్కూటర్ ఉత్పత్తి చేస్తుంది.
- సీవీటీ ఆటోమేటెడ్ గేర్‌బాక్స్‌తో ఈ స్కూటర్‌ను టీవీఎస్ కంపెనీ తీసుకురానుంది.
- ఈ స్కూటరు టాప్ స్పీడ్‌లో గంటకు 80.5 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
- మెటల్ మాక్స్ బాడీతో జూపిటర్ 125 సీఎన్‌జీ స్కూటరును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.
- ఎల్ఈడీ హెచ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్ ఇన్ వన్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.
- ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఇంటెలిగో టెక్నాలజీతో ఈ స్కూటరు వస్తుంది.