Motorcycles With Best Seats: లాంగ్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ బెస్ట్ బైక్స్ మీకోసమే?
ప్రస్తుత రోజులు ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నచిన్న దూరాలకు కూడా బైకులనే ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం చి
- By Nakshatra Published Date - 05:00 PM, Thu - 7 December 23
ప్రస్తుత రోజులు ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నచిన్న దూరాలకు కూడా బైకులనే ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం చిన్న దూరాలకు మాత్రమే కాకుండా ఎప్పుడైనా లాంగ్ టూర్ లాంగ్ డ్రైవింగ్ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో వచ్చే బైకులు కేవలం డ్రైవింగ్ చేసే వారికి తప్ప వెనక కూర్చోవడానికి కూడా సరిగా బైక్స్ రావడం లేదు. కాగా టూ వీలర్లను సౌకర్యవంతంగా మార్చడంలో సీట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ దూరాలు ప్రయాణించేటప్పుడు,ఒక సౌకర్యవంతమైన సీటు మీ ప్రయాణాన్ని చాలా సులభతం చేయడంతో నొప్పి లేని విధంగా మీ గమ్యస్థానానికి చేర్చుతుంది. అయితే ఒకవేళ మీరు ఎక్కువ దూరాలు టూ వీలర్ల పై ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారా, అందుకోసం సౌకర్యవంతమైన సీటు కలిగిన బైక్ కోసం చూస్తున్నారా, అయితే ఇది మీకోసమే. మరి లాంగ్ టూర్ వెళ్లాలి అనుకున్న వారికి ఎటువంటి బైక్స్ అయితే సౌకర్యవంతంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాయల్ ఎన్ ఫీల్డ్ మీటోర్ 350/రాయల్ ఎన్ ఫీల్డ్ సూపర్ మెటోర్ 650.. ఈ బైక్ కంఫర్ట్ గా ఉండే ప్లష్ సీట్ తో వస్తుంది. ఇది బైక్ రైడర్ తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా బాగా సపోర్టు ఇస్తుంది. అయితే దీంతో రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ పాయింట్ ఆధారంగానే సూపర్ మెటోర్ 650ని లాంచ్ చేసింది. మెటోర్ 350 ఆర్కిటెక్చర్ ఆధారంగానే ఇది లాంచ్ అయ్యింది. ఇది లాంగ్ టూర్లకు బాగా సరిపోతోంది.
హోండా సీబీ 500ఎక్స్.. ఈ బైక్ లో వెడల్పాటి, సౌకర్యవంతమైన సీట్లు మంచి కుషనింగ్ తో వస్తాయి. ఈ బైక్ ధర రూ. 5,79,952 ఎక్స్ షోరూం గా ఉంది. ఉంది. ఇది 471.03సీసీ ప్యారలెల్ ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 47బీహెచ్పీ, 43.2ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సుదూర ప్రయాణాల్లో సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని కుడా అందిస్తుంది. కాబట్టి ఈ దూర ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి ఈ బైక్ కూడా బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.
బీఎండబ్ల్యూ ఆర్ 1250జీఎస్.. ఈ బైక్ కూడా సౌకర్యవంతమైన సీటును అందిస్తుంది. ఇది రైడర్ తో పాటు వెనుక కూర్చుకున్న వ్యక్తికి కూడా అద్భుతమైన సపోర్టును అందిస్తుంది. దీనిలో అనేక రకాలైన అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఇంటిగ్రల్ ఏబీఎస్ ప్రో, హిల్ స్టార్ట్ కంట్రోల్ వంటి ఉన్నాయి. ఇది కూడా దూర ప్రయాణాలకు అనువైన ఎంపిక. కాగా ఈ బైక్ ధర రూ. 20.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ట్రయంఫ్ బొన్నవిల్లే టీ120.. ఈ క్లాసిక్ స్టైల్ కలిగిన మోటార్ సైకిల్ లో మంచి కుషనింగ్ తో సౌకర్యవంతమైన సీటు వస్తుంది. దీని ధరలు రూ. 11.09లక్షలు ఎక్స్ షోరూం నుంచి వస్తాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి ఈ బైక్ కూడా బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.
యమహా ఎఫ్ జెడ్ ఎఫ్1 వీ4.0… ఈ బైక్ కి కూడా వెడల్పాటి సీటు మంచి కుషనింగ్ తో ఉంటుంది. ఇది గతుల రోడ్డులోనూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. సింగిల్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది.
సుజుకీ వీ స్ట్రామ్ 650ఎక్స్ టీ… ఈ బైక్ రైడర్ తో పాటు వెనుక కూర్చొనే వారికి కూడా మంచి సౌకర్యవంతమైన సీటును అందిస్తుంది. ఇది కఠినమైన పరిస్థితుల్లో కూడా స్మూత్ రైడ్ అందిస్తుంది.
Related News
Top Bikes Under 1Lakh: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో అదరగొడుతున్న బైక్స్.. టాప్ లో ఆ బైక్?
ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు