HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >These Are The Longest Range Electric Bikes In India

Electric Bikes: ఈ బైక్స్ సూపర్ గురు.. ఒక్క చార్జ్‌తో 300కి.మీ.లకు పైగా రేంజ్?

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దాంతో ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధ

  • Author : Anshu Date : 25-02-2024 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 25 Feb 2024 06 58 Pm 3318
Mixcollage 25 Feb 2024 06 58 Pm 3318

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దాంతో ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ నచ్చే విధంగా ఉండే బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీని కారణం అవి ఎక్కువ రేంజ్ ఇవ్వడం లేదు. సింగిల్ చార్జ్ పై 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తున్నాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం దాదాపు 300 కిలో మీటర్లకు పైగా రేంజ్ ఇచ్చేవి ప్రస్తుతం మన దేశ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రేంజ్ గురించే మీరు ఆలోచించిస్తుంటే మీకు ఇవి మంచి సొల్యూషన్ కాగలవు. అయితే సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే కలిగే ఆ స్కూటర్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల్ట్రావయోలెట్ ఎఫ్77.. ఇది సూపర్ ఫాస్ట్ ఈ-బైక్. దీని టాప్ ఎండ్ మోడల్ ఏకంగా సింగిల్ చార్జ్ పై 307 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వాస్తవానికి దీనిని 2019 లాంచ్ చేసిన సమయంలో 4.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ రిమూవబుల్ ప్యాక్‌లో వచ్చింది. అయితే 2023లో అప్ గ్రేడెవ్ వెర్షన్ ను తీసుకురాగా అది 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థంతో వచ్చింది. దీని సాయంతో సింగిల్ చార్జ్ పై 307 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 152 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 5.0 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే , ఆటో ఆన్/ఆఫ్ హెడ్‌ల్యాంప్‌లు, రియల్ టైమ్ ట్రాఫిక్ సహాయంతో నావిగేషన్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనపు భద్రత కోసం, దొంగతనం జరిగినప్పుడు లాక్‌డౌన్ మోడ్ కూడా ఉంది. కోమాకి రేంజర్ ఇది క్రూయిజర్ లుక్లో అదరగొట్టే ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై 250 కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. దీని రూ. 1.85లక్షలు ఉంటుంది.

దీనిలో 7 అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అంతర్నిర్మిత నావిగేషన్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ 4.5 కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కబీరా మొబిలిటీ కేఎం4000.. ఇది మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 201 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. దీనిలో డ్యూయల్ సీబీఎస్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనో షాక్ రియర్ సస్పెన్షన్ తో వస్తుంది. దీని ధర రూ. 1,76,000ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఇది గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

పవర్ ఈవీ పీ- స్పోర్ట్ ప్లస్.. ఏపీకి చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ పవర్ ఈవీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని పేరు పీ- స్పోర్ట్ ప్లస్ ఇది సింగిల్ చార్జ్ పై 210 కిమీ పరిధితో వస్తుంది. దీనిలో 4.8కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిలో రిమూవబుల్ గా ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్‌ ఉంటుంది.

ఓర్క్సా మాంటిస్.. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఓర్క్సా ఎనర్జీస్ నుంచి వచ్చిన ఈ-బైక్ ఇది. సింగిల్ చార్జ్ పై 221 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుంది. దీనిని 1.3 కేడబ్ల్యూహెచ్ రెగ్యులర్ ఛార్జర్‌తో రూ . 3.6 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. 5-అంగుళాల డిజిటల్ టీఎఫ్టీ డిస్‌ప్లే, సైడ్-స్టాండ్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంది. బైక్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి, డెలివరీలు ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతాయి. గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • electric bikes
  • india
  • range electric

Related News

Mobile Number Numerology

Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, మొబైల్ డేటాపై నామమాత్రపు పన్ను విధించడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Petrol Price Hike

    War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు

  • Indian-Origin YouTuber Nancy Grewal

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

Latest News

  • సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

  • Suryakumar Yadav : అక్షర్ పటేల్ కు క్షేమపణలు చెప్పిన కెప్టెన్ సూర్య..ఎందుకని ?

  • Lover Suicide : పెళ్లికి ఆలస్యం చేస్తుందని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్య

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd