TATA: ఆ టాటా కారుపై ఏకంగా రూ. 85 వేల డిస్కౌంట్.. అద్భుతమైన మైలేజ్ తో పాటు!
టాటా కారును కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది టాటా సంస్థ.
- By Anshu Published Date - 01:40 PM, Mon - 5 August 24

మీరు కూడా సెడాన్ కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఇది మీకోసమే. త్వరలో సెడాన్ కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారుల కోసం ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రసిద్ధ సెడాన్ టిగోర్ పై ఆగస్టు నెలలో బంపర్ తగ్గింపును అందిస్తోంది. మీరు ఆగస్టు 2024లో టాటా టిగోర్ కారును కొనుగోలు చేస్తే దాదాపుగా రూ. 85,000 తగ్గింపు పొందవచ్చట. కాగా ఈ ఆఫర్ లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి.
ఈ తగ్గింపు టాటా టిగోర్ మోడల్ ఇయర్ 2023లో అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ కారుకు సంబంధించి మరిన్ని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటో ఏసీ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇది కాకుండా కారు భద్రత కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్ లను పొందుతుంది. టాటా టిగోర్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ లకు పోటీగా ఉంది.
కాగా భారతీయ మార్కెట్లో ఈ టాటా టిగోర్ ప్రారంభ ధర రూ. 6.30 లక్షల నుండి రూ. 9.55 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఈ టాటా టిగోర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 86bhp శక్తిని, 113Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేసి ఉంది. ఈ కారులో CNG పవర్ ట్రెయిన్ ఎంపిక కూడా ఉంది. ఇది గరిష్టంగా 73.5bhp శక్తిని, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టాటా టిగోర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో 19.28 kmpl, పెట్రోల్ ఆటో మేటిక్ వేరియంట్ లో 19.60 kmpl, CNG మాన్యువల్ వేరియంట్ లో 26.40 kmpl, CNG ఆటో మేటిక్ వేరియంట్ లో 28.06 kmpl మైలేజీని కంపెనీ క్లెయిమ్ చేస్తుందట.