Tata Motors: దీపావలి ఆఫర్స్.. ఆ టాటా కార్లపై ఏకంగా అన్ని లక్షల డిస్కౌంట్!
పండుగల సీజన్ సందర్భంగా టాటా కంపెనీ కొన్ని కార్లపై అద్భుతమైన బంపర్ ఆఫర్లను అందిస్తోంది.
- By Anshu Published Date - 10:00 AM, Fri - 11 October 24

ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కార్లు స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు అలాగే అనేక ఇతర వస్తువులపై ఆన్ లైన్ లో అలాగే ఆఫ్ లైన్ లో అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు టాటా మోటార్స్ కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కూడా కొత్త టాటా కంపెనీ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీరు కొత్త కారుపై లక్షల రూపాయలు ఆదా చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టాటా మోటార్స్ టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్, టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా సఫారీ, టాటా హారియర్ వంటి మోడళ్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.
ఇకపోతే అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. టాటా టియాగో XE, XM, XTD మినహా అన్ని వేరియంట్లపై దాదాపుగా రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు ఈ కారు CNG, పెట్రోల్ మోడళ్లపై కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. టాటా ఆల్ట్రోజ్ స్పోర్టీ లుకింగ్ రేసర్ వేరియంట్‌పై కంపెనీ రూ. 50 వేల తగ్గింపు, ఇందులో ఎక్స్ఛేంజ్ ఆఫర్, కార్పొరేట్, అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అయితే టాటా ప్రసిద్ధ ఎస్‌యూవీ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 20 వేలు, సీఎన్‌జీ 15,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. టాటా పంచ్ 2023 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు వరుసగా రూ. 18 వేలు, రూ. 15 వేల వరకు తగ్గింపు ఉంది.
మరోవైపు, నెక్సన్ SUV స్టాండర్డ్ 2024 మోడల్ పై 20 వేల రూపాయల వరకు, ఫియర్ లెస్ రేంజ్ పై 35 వేల రూపాయల వరకు తగ్గింపు ఉంది. ఇక పెట్రోల్ వేరియంట్‌పై 95 వేల రూపాయలు, డీజిల్ వేరియంట్‌పై 85 వేల రూపాయల వరకు ఆదా చేసే అవకాశంని కల్పిస్తోంది. టాటా సఫారి 2024 మోడల్ పై 50 వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ కారు గత సంవత్సరం అంటే 2023 వేరియంట్‌పై 1.33 లక్షల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. మరోవైపు మీరు పూర్తి పరిమాణ ఎస్‌యూవీ హారియర్ 2023 మోడల్ ను కొనుగోలు చేస్తే మీరు కంపెనీ నుండి రూ. 1.33 లక్షల తగ్గింపును పొందవచ్చు..