Hunter 350: ఈతరం అభిరుచిని అద్దంపట్టే “హంటర్ 350”!
"హంటర్ 350".. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన ఈ బైక్ ఆదివారం మార్కెట్లో విడుదల కానుంది.
- By Hashtag U Published Date - 08:30 AM, Mon - 8 August 22

“హంటర్ 350”.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన ఈ బైక్ ఆదివారం మార్కెట్లో విడుదల కానుంది.
మిగిలిన బైక్స్‌తో పోలిస్తే ఇందులో 350సీసీ రేంజ్, ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌ను అమర్చారు. హంటర్‌లో రౌండ్ లైట్ క్లస్టర్‌లు,స్పీడ్‌ను కంట్రోల్ చేసే ట్విన్ రియర్ షాక్‌లు ఉంటాయి. దీంతోపాటు అనేక క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డిజైన్ ఎలిమెంట్స్‌ను కూడా కలిగి ఉంది. అయితే మొత్తం డిజైన్ 350 సీసీ శ్రేణిలో క్రూయిజర్ కంటే రోడ్‌స్టర్‌గా ఉంది. సీసీ ఒకేలా ఉన్నా బైక్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది.ఈ బైక్ ధర రూ.1,30,000 నుంచి రూ.1,40,000 మధ్యలో ఉండనుంది.
స్పీడ్‌ను కంట్రోల్ చేసేందుకు..
ఈ బైక్‌లో స్పీడ్‌ను కంట్రోల్ చేయడంతో పాటు పెంచేందుకు ఉపయోగపడే ఫ్రంట్ పోర్క్‌ను 41ఎంఎం(మిల్లీ మీటర్స్) నుంచి 130ఎంఎం వరకు అందించింది. అయితే వెనుక భాగంలో 6 దశల ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్,102ఎంఎం వీల్ ట్రావెల్‌తో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చారు. 17 అంగుళాల టైర్లను ఈ బైక్ లో అమర్చారు.
మీకు చాలా సౌకర్యం గురూ..
* టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడర్‌కు మోకాళ్లపై స్ట్రెస్ తగ్గించింది.
* ఫ్రీగా ఉండేలా డ్రైవింగ్ సీటు వెనుక బాగా ఫ్లాట్‌గా ఉండేలా రూపొందించింది.
* ఫుట్ పెగ్‌లు మరింత వెనక‍్కి జరిపి స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది.
* ఈ బైక్‌లో టెయిల్ ల్యాంప్ ఎల్‌ఈడీ యూనిట్ అయితే హెడ్‌ల్యాంప్ హాలోజన్ బల్బ్‌తో వస్తుంది.